శ్రీదేవితో జగపతి బాబు

Prasad
జగపతిబాబు సినిమా కెరీర్ ‘ఆహా.. ఓహో..’ అనే రేంజ్ లో కాకపోయినా అవకాశాలకు మాత్రం కొదవుండదు. ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తునే ఉంటాడు. కాగా, ఈ సారి శ్రీదేవితో నటించబొతున్నాడట. శ్రీదేవి చాలా రోజుల తరువాత ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన కామెడీ పాత్రను హిందీలో అమితాబ్ పోషిస్తుండగా, తమిళంలో అజిత్ పోషిస్తున్నారు. కాగా, తెలుగులో ఈ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: