రాత్రి జరిగిన ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృష్ణంరాజు ప్రభాస్ ను పొగుడుతూ అతడి రేంజ్ పై చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. ‘బాహుబలి’ మూవీ ప్రాజెక్ట్ గురించి ఈసినిమా గురించి రాజమౌళి పడ్డ కష్టంగురించి మాట్లాడుతూ మధ్యలో ప్రభాస్ ఈసినిమా గురించి పడ్డ కష్టం గురించి ప్రస్తావిస్తూ కృష్ణంరాజు ఈ కామెంట్స్ చేసాడు.
ఈసినిమాను తీసిన రాజమౌళి కుటుంబం అంతా భోజనం టేబుల్ దగ్గర కూడా బహుశా ఈనాలుగు సంవత్సరాలు కూడా ‘బాహుబలి’ గురించే మాట్లాడుకుని ఉంటారు. ఆ కుటుంబం అంతా ఈ సినిమా పై అంతలా కష్టపడ్డారు కాబట్టే ఈ సినిమాకు అంత పేరు వచ్చింది అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసాడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎందుకు చేశాడో చెపుతూ కృష్ణంరాజు ప్రభాస్ పడ్డ కష్టానికి మార్కులు వేసాడు.
‘రాజమౌళి ఈ సినిమాను చేయమని అడగ్గానే ప్రభాస్ ఏమీ ఆలోచించలేదు. అప్పుడు మాతమ్మడు సూర్య నారాయణరాజు కూడ ఉన్నాడు. ఏరా చేస్తావా అని ప్రభాస్ ను అడిగితే ప్రభాస్ ఎస్ అన్నాడు. ఎన్నిరోజులు పడుతుంది, నాకేంటి ఏమొస్తుంది ఇలాంటివేవి ఆలోచించలేదు. కేవలం రాజమౌళి మీద నమ్మకంతో వెంటనే ఓకె చెప్పాడు. ఈరోజును దాని ఫలితం చూస్తున్నాం'' అంటూ కామెంట్ చేయడమే కాకుండా బాహుబలి మూవీ ప్రాజెక్ట్ వల్ల ప్రభాస్ ఈ నాలుగు సంవత్సరాలలో ఏమిపోగొట్టుకున్నాడో వివరించాడు.
గతంలో తానూ హీరోగా నటిస్తున్న రోజులలో రియాల్టీకి కాస్త దగ్గరగా చేస్తున్నావ్ అని తన దర్శకులు తనను ప్రశంసించిన సందర్భాలను గుర్తుకు చేసుకుంటూ యాక్టింగ్ అంటే యాక్టింగ్ లా కాకుండా రియాల్టీగా చేయాలంటే ఎంత కష్టమో వివరించాడు కృష్ణంరాజు. అప్పట్లో తనకు తానూ ఒక యాక్టర్ గా 50% మార్కులు వేసుకుంటే ‘బాహుబలి’ లో ప్రభాస్ మాత్రం చాలా ఎదిగిపోయి యాక్టర్ గా ప్రభాస్ ఇప్పుడు 75-80% మార్కుల రేంజ్ లో రియలిస్టిక్ నటుడిగా ఎదిగాడు అంటూ ప్రభాస్ నటుడిగా టాప్ స్థానంలో ఉన్నాడు అన్న సంకేతాలు ఇచ్చాడు కృష్ణంరాజు. దీనితో ఈ కామెంట్స్ విన్న ప్రభాస్ అభిమానులు మాత్రం రెబెల్ స్టార్ మార్కులకు ఖుషీ అయిపోయారు..