వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు నాయక్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. యాక్షన్ సీన్స్ ను అద్బుతంగా తెరకెక్కంచే వినాయక్ దర్శకత్వంలో చరణ్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాను యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. కాజల్, అమలాపౌల్ కథనాయికలు.
కాగా, ఈ సినిమా ప్రారంభం నుంచే సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ సతీమణి, చరణ్ తల్లి సురేఖ హాజరయ్యారు. అవిడ ఇలా సినిమా ఫంక్షన్స్ కు రావడం చాలా రోజులు తరువాత ఇదే తొలిసారి.
అలాగే గతంలో పూరీ జగన్నాథ్, అల్లు అర్జున్ కలయికలో దేశముదురు సినిమా తీసిన దానయ్య, ఈ సారి వినాయక్, చరణ్ కలయికలో ఈ నాయిక్ ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వినాయక్ తరహాలో యాక్షన్ సీన్స్ ప్రధానంశంగా, రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.
అలాగే ఈ సినిమాలో వినోదానికి పెద్ద పీట వేశారని, బ్రహ్మనందం పోషిస్తున్న ‘జిలేబీ’ పాత్ర ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెపుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: