స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే చాలు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. లాస్ట్ ఇయర్ సరైనోడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఈసారి హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు. సినిమాలో బ్రాహ్మాణునిగా నటిస్తున్న బన్ని లుక్ ఈరోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చెప్పినట్టుగానే సంప్రదాయ బద్ధంగా బ్రాహ్మణ లుక్ లో బన్ని అదరగొట్టాడు.
పాత బజాజ్ స్కూటర్, వెనకలా అరిటి గెలలు.. ఆకు కూరలు ఇలా బన్ని ఫస్ట్ లుక్ దుమ్ముదులిపేస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బన్ని ఇంతవరకు చేయని క్యారక్టర్ లో కనిపిస్తుండటం విశేషం. ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద అంచాలను పెంచేశారు. ఫస్ట్ లుక్ బ్యాక్ గ్రౌండ్ కూడా అంతా నేటివిటీ తెలిసేలా డిజైన్ చేశారు.
దిల్ రాజు ప్రొడక్షన్ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ టార్గెట్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సరైనోడుతో సమ్మర్ సూపర్ సెన్షేషన్ గా మారిన బన్ని ఈ సమ్మర్ కూడా దువ్వాడ జగన్నాథంతో సూపర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.