పవన్ బైక్ ను ప్రమోట్ చేస్తున్న నాగార్జున !

Seetha Sailaja
నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ' ఫలితం తేలిపోవడంతో ఇప్పుడు నాగ్ ఆలోచనలు ఈనెలలోనే మొదలు కాబోతున్న ఓంకార్ హారర్ థ్రిల్లర్ 'రాజు గారి గది 2' పై మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో తీస్తున్న ఈమూవీ షూటింగ్ ఈనెల 17 నించి ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ఈసినిమాలో విలక్షణంగా కనిపించే నాగ్ గెటప్ గురించి అప్పుడే వార్తలు మొదలైపోయాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు అతేంద్రియ శక్తుల పై పరిశోధనలు జరిపే ఒక మానసిక వైద్యుడుగా నాగార్జున కనిపించబోతున్నాడు.  ఈసినిమా కోసం నాగార్జున వాడబోతున్న బైక్ ‘గోపాల గోపాల’ మూవీలో పవన్ కళ్యాణ్ వాడిన బైక్ అని తెలుస్తోంది. 

ఆ బైక్ కు కొన్ని మార్పులు చేర్పులు చేసి నాగార్జున నటిస్తున్న ‘రాజు గారి గది 2’ లో వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బైక్ డిజైన్ నాగార్జున ఇచ్చిన సూచనలతో ఓంకార్ ప్రత్యేక శ్రద్ధతో డిజైనింగ్ కార్యక్రమాలు పూర్తి చేసాడని వార్తలు వస్తున్నాయి.  

ఈసినిమాలో నాగార్జున డ్రెస్సింగ్ నుంచి లుక్స్ వరకు అన్నీ ట్రెండీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు తెలుగులో ఏ టాప్ హీరో ఇటువంటి పాత్రను చేయని నేపధ్యంలో ఈ మూవీ ప్రారంభం కాకుండానే భారీ అంచనాలు పెరిగి పోతున్నాయి.  

దీనికితోడు ఈ మూవీలో అక్కినేని వారి కోడలుగా మారిన తరువాత సమంత మొట్టమొదటిసారి నాగార్జునతో కలిసి నటిస్తున్న నేపధ్యంలో ఈ మూవీ బిజినెస్ కు వీరిద్దరి కాంబినేషన్ ఒక ప్లస్ పాయింట్ అవుతుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.  ‘రాజు గారి గది’ లో  హీరోగా చేసిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఒక ముఖ్య పాత్రలో ఈసినిమాలో కనిపిస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించి పాజిటివ్ టాక్ ఈసినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే మొదలైపోయింది..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: