ఆత్మబలం సినిమాలోని ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే..’ అనే పాట ఇప్పటికీ తెలుగు వారిని అలరిస్తూనే ఉంటుంది. ఈ పాటలోని సంగీత, సాహిత్యలతో పాటు, అక్కినేని, సరోజదేవిల అభినయం అందర్నీ ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటలో బి.సరోజదేవి తలకు ఒక స్కార్ఫ్ (గుడ్డ) కనిపిస్తుంది. అందం కోసం సరోజదేవి అలా స్కార్ఫ్ కట్టుకుందని అందరూ అనుకుంటారు.
అయితే అసలు కథ వేరే వుంది. సరోజా ఈ పాట షూటింగ్ లో పాల్గొనే ముందు ఒక హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొంది. అక్కడ ప్రమాదవశాత్తూ తలకి బలమైన దెబ్బ తగిలింది. ఆ దెబ్బ కనిపించకుండా తలకు స్కార్ఫ్ కట్టుకుని చిటపట.. పాటలో నటించింది.
మరింత సమాచారం తెలుసుకోండి: