హీరోయిన్ @ రూ.కోటి

murali
ఇటీవలి కాలంలో తెలుగు సిని పరిశ్రమ కళకళలాడుతోంది. వరుస హిట్లతోపాటు హీరోయిన్ల కొరత పరిశ్రమను వేధిస్తోంది. పాత తరం నాయికలతో పోలిస్తే నేటి తరం హీరోయిన్లకు బాగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఒకటి రెండు సినిమాలు బాగా ఆడితే చాలు హీరోయిన్లు ‘కోటి’ దిగనంటున్నారు. పైగా టాలివుడ్ లో రాణించకపోతే బాలివుడ్..అక్కడా కుదరకపోతే టివీ రియాలిటీ షోలు..కొత్త షారూం ప్రారంభోత్సవాలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా హీరోలు సైతం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తుండటం, నిర్మాతలు సైతం ఏ సినిమా హిట్ అవుతుందో ఆ హీరోయిన్ కోసం క్యూ కట్టడంతో రెమ్యునేషన్ అమాంతంగా పెంచేస్తున్నారు. నిర్మాతలు సైతం తమ సినిమాలో నటించేందుకు సదరు హీరోయిన్ ఒప్పుకుంటే కోటి రూపాయలుకు ఎక్కువైన ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఇప్పుడు అలాంటి బ్లాక్ బాస్టర్ హీరోయిన్ ఎవరంటే ముందుగా సమంత గురించి చెప్పుకోవాలి. ఈ ముద్దుగుమ్మ నాలుగు టాలివుడ్ చిత్రాల్లో నటిస్తే నాలుగూ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా అందులో దూకుడు, ఈగ చిత్రాలు ఇండస్ర్టీ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక ఏం మాయ చేశావే, బృందావనం హిట్ల సమంత జాబితాలో చేరిపోయాయి. ఇక తరువాత నిలిచేది కాజల్. ఈ అమ్మడు రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. తాజాగా పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెస్ మేన్’ చిత్రాలు కాజల్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఇక తమన్నా సైతం బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చేరిన రచ్చ చిత్రంలో నటించింది. మొన్నటి దాక ఐరన్ లెగ్ అంటూ విమర్శించిన వాళ్లకు శృతిహాసన్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ద్వారా తాను కూడా బ్లాక్ బస్టర్ హీరోయిన్ అని తెలియజేసింది. గబ్బర్ సింగ్ ఇప్పటికే ఇండస్ర్టీ రికార్డులను తిరగరాస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: