వరస హిట్స్ తో దూసుకు పోతున్న నాని ‘మజ్ను’ రేపు విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ నాని చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈసినిమాను తాను చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఫలానా సన్నివేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని లెక్కలు వేసుకుని తాను ‘మజ్ను’ సినిమాను చేయలేదు అంటూ ఆ శక్తికర వ్యాఖ్యలు చేసాడు.
కొంత కాలంగా తన సినిమాలను చూడటానికి ఎంతో నమ్మకంగా ధియేటర్లకు వస్తున్నారని ఆ నమ్మకాన్ని తన ‘మజ్ను’ ఏ మాత్రం పోగొట్టదని ప్రేక్షకులకు నమ్మకాన్ని కలిగిస్తున్నాడు నాని. ఈసినిమా టైటిల్ చూసుకుని ఎదో ఊహించుకుని ధియేటర్లకు రావద్దని ఏ ఇబ్బంది లేకుండా సరదాగా రెండున్నర గంటలు ఎంజాయ్ చేయడానికి ‘మజ్ను’ దియేటర్స్ కు రమ్మని నాని ఈ సినిమాను చాల వ్యూహాత్మకంగా ప్రమోట్ చేస్తున్నాడు.
అంతేకాదు ఎటువంటి లెక్కలు వేసుకోకుండా తాను చేసిన సినిమా ‘మజ్ను’ అని అంటూ దర్శకుడు విరించి వర్మలో ఉండే నిజాయితీ తనకు నచ్చి ఈ స్వచ్చమైన కథతో కూడుకున్న సినిమాలో తాను నటించానని ఈ సినిమాలో అద్భుతాలు ఊహించుకోవద్దు అంటూ తాను ఈసినిమా ఒక కమర్షియల్ దృష్టితో చేయలేదు అన్న సంకేతాలు ఇస్తున్నాడునాని.
అయితే ఈసినిమా ప్రథమార్ధంలోనే నాలుగు పాటలుంటాయని ఇలాంటి సాహసం సామాన్యంగా గా ఎవరూ చేయరు అని అంటూ ఆ పాటలు ఈ సినిమా కథలో భాగంగా కనిపిస్తాయి కాబట్టి అవి ప్రేక్షకులను నిరుత్సాహ పరచదు అని అంటున్నాడు నాని. ఈసినిమా మొదలైనప్పటి నుంచి చి ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు చెరిగిపోదు అని అంటూ ఎక్కడ ఒక్క సన్నివేశంలో కూడా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు అని అంటున్నాడు నాని.
అయితే ఈ సినిమా కేవలం మరికొద్ది గంటలలో రేపు విడుదల అవుతున్నా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా స్పీడ్ అందుకొక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనికితోడు ఈసినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న అను ఇమాన్యుయల్ – ప్రియశ్రీ లు టాలీవుడ్ సినిమా రంగానికి కొత్తవాళ్ళు కావడంతో హీరోయిన్స్ క్రేజ్ ఈసినిమాకు ఏ మాత్రం సహకరించే ఆస్కారం లేదు. దీనితో అన్నింటా తానై నాని నడిపిస్తున్న ఈ ‘మజ్ను’ ప్రయోగం ఎంతవరకు విజయాన్నిస్తుందో చూడాలి..