నానీకి పరీక్షగా మారిన మజ్ను !

Seetha Sailaja
ఒక హీరోకి వరసగా 4 హిట్లు రావడం సర్వసాధారణ విషయం కాదు. ఇటువంటి వరస విజయాలు స్టార్ హీరోల కుటుంబాల నుండి వచ్చిన హీరోలకు వచ్చి ఉంటే వారి క్రేజ్ ఊహించని స్థాయిలో ఉండి ఉండేది. అయినా ప్లాన్డ్ గా తన కెరియర్ ను మలుచుకుంటున్న నాని ఎటువంటి పొరపాట్లు చేయకుండా చాల తెలివిగా తన సినిమాల కథలను ఎంపిక చేసుకుంటూ చాల వ్యుహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.  

అయితే ఎల్లుండి విడుదల కాబోతున్న ‘మజ్ను’ నానీకి ఒక తలనొప్పిగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి.  కారణాలు తెలియకపోయినా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్ పై ఏ మాత్రం ఆ శక్తి చూపించడంలేదు అన్న గుసగుసలు వినపడుతున్నాయి.  

దీనికితోడు ‘జెంటిల్‌మన్’ వచ్చిన మూడు నెలలకే ఈ సినిమా రిలీజవుతుండటంతో ప్రేక్షకులు కూడ నానీ సినిమా పట్ల  మరీ అంత ఎగ్జైట్మెంట్ తో లేరు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ సినియా ప్రమోషన్లు కూడా పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా పై ప్రస్తుతం ఫిలింనగర్ లో పెద్దగా చెప్పుకో తగ్గ క్రేజ్ ఏర్పడ లేదు. ఈ విషయాలు అన్నీ నాని దృష్టి వరకు రావడంతో ఈ సినిమా రిజల్ట్ గురించి నాని టెన్షన్ పడుతున్నట్లు టాక్.  

అయితే ‘మజ్ను’ సినిమా మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో ఈ సినిమా నిర్మాతలు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నా ఇలా మితిమీరిన ఆత్మ విశ్వాసం కూడ ‘మజ్ను’ ను దెబ్బ కొడుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ‘మజ్ను’ కంటెంట్ ఉన్న సినిమాగా అనిపిస్తున్నా అసలు ఏ మాత్రం ప్రచారం లేకుండా విడుదల చేస్తే అసలకే మోసం వస్తుంది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.

నానీకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చినా ఈ సినిమా విడుదలైన మరో వారం గ్యాప్ లో రామ్ ‘హైపర్’ ఆ తరువాత దసరా సీజన్ ను టార్గెట్ చేస్తూ నాగచైతన్య ‘ప్రేమమ్’ భారీ బడ్జెట్ సినిమా ‘జాగ్వార్’ సునీల్   ‘వీడు గోల్డ్ ఎహె’ వరస పెట్టి విడుదలవుతున్న నేపధ్యంలో ప్రచారం లేకుండా ‘మజ్ను’ విడుదలైతే ఆ తరువాత ఆ సినిమా నిలతోక్కుకోవడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి.  ఈ విషయాలన్నీ నాని దృష్టివరకు వెళ్ళడంతో మంచి పీరియడ్ రన్ అవుతోంది అని అనుకుంటున్న నేపధ్యంలో ఈ టెన్షన్ ఏమిటి అని నాని తల పట్టుకుంటున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: