తనీష్ తో రియల్ స్టార్

Prasad
రియల్ స్టార్ శ్రీహరి హీరోగానే కాదు, ప్రత్యేక పాత్రలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీహరి ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా సూపర్ హిట్ అనే అభిప్రాయం కూడా టాలీవుడ్ లో ఉంది. తాజాగా మరొక సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించడానికి శ్రీహరి అంగీకరించాడు. యువహీరో తనీష్ నటించే సినిమాలో శ్రీహరి ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. నారాయణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండారు నారాయణ రాజు నిర్మించే ఈ సినిమాతో ఆర్.ఎస్.లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నారాయణ రాజు మాట్లాడుతూ ‘కుటుంబ నేపధ్యంలో సాగే చిత్రమిది. ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలకు మంచి ప్రాధాన్యత ఉంటుందని’ తెలిపారు. లవర్ బోయ్ గా తనీష్ కనిపించే ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే పాత్రను శ్రీహరి పోషిస్తున్నారని నిర్మాత చెప్పారు. హీరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: