సమంతకు ప్లస్

HANUMA HANUMA
నాని, సమంత మ్యాజికల్ హిట్ ‘ఈగ’ జోరు తగ్గకముందే మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆచిత్రం పేరు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’.  ఈ సినిమా సంగీతం ఈ నెలాఖరున విడుదల కానుంది. సోనీ మ్యూజిక్ హయ్యస్ట్ ప్రైజ్ కు ఈ హక్కులను సంపాదించారు. సమంతను తెలుగుకు పరిచయం చేసిన గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన ఇళయరాజాతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. తమిళంలో సమంత, జీవా కలిసి నటించారు. రెండు భాషల చిత్రాలను ఒకే సారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమంత ‘ఈగ’ జోరుమీదున్నప్పుడే మరో సినిమా విడుదల కావడం ఆమెకు ప్లస్ పాయింటే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: