చరణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్

HANUMA HANUMA
అల్లు అర్జున్ తో ‘జులాయి’కి పనిచేసిన త్రివిక్రమ్ త్వరలో రామ్ చరణ్ సినిమాకు పనిచేయబోతున్నారు. అయితే దర్శకుడిగా కాదు. గీత రచయితగా. జంజీర్ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. చింతకాయల రవి యోగి ఈ సినిమా తెలుగు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. యోగి గతంలో తాను దర్శకత్వం వహించిన ఒకరాజు ఒకరాణి, చింతకాయల రవి చిత్రాలకు త్రివిక్రమ్ చేత పాటలు రాయించుకున్నారు. మన్నుతినే కుర్రతనం కాదమ్మో పాట త్రివిక్రమ్ రాసిందే. నువ్వే నువ్వేలో కంప్యూటర్సు, మాథ్స్ సైన్సు పాటను పాడింది కూడా త్రివిక్రమ్. త్రివిక్రమ్ లోని గీత రచయితను యోగి అవకాశం వచ్చిన ప్రతిసారీ వాడుకుంటూ ఉంటాడు. తాజాగా రామ్ చరణ్ జంజీర్ తెలుగు వర్షెన్లోనూ త్రివిక్రమ్ తో ఓ పాట రాయించారట. అలా త్రివిక్రమ్ చరణ్ కాంబినేషన్ లో వర్క్ జరుగుతోంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: