సౌత్ సూపర్ హీరోయిన్ నయనతార లవ్ ఫెయిల్ అయ్యిందని మీడియా తెగ హడావిడి చేసింది.. ముచ్చటగా మూడో లవ్ కూడా బ్రేక్ అప్ చెప్పేసిందని కొద్దిరోజులుగా నయన్ మీద ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు అవునని గాని కాదని గాని సమాధానం ఇవ్వని నయనతార తాజాగా జరిగిన 63వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుని తన ప్రియుడు విఘ్నేష్ తో క్లోజ్ గా కనబడి అందరికి షాక్ ఇచ్చింది.
తమిళ సినిమా నాన్ రౌడీ థాన్ గాను బెస్ట్ హీరోయిన్ అవార్డ్ కైవసం చేసుకున్న నయనతార ఆ సినిమా దర్శకుడు విఘ్నేష్ తో తన హ్యాపీనెస్ ను పంచుకుంది. కొద్దికాలంగా వీరిద్దరు ప్రేమలోకంలో విహరిస్తున్నారని టాక్. అయితే ఇద్దరు విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారని రూమర్లు వచ్చాయి. కాని అవార్డ్ దక్కిచుకున్న నయన్ విఘ్నేష్ తో ఇలా స్టిల్ ఇచ్చింది.
సో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే వీరి లవ్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్లో ఓ పక్క ప్రయోగాలు చేస్తూ మరో పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న నయనతార తను సినిమాలో ఉంటే అది సూపర్ హిట్ అన్న పరిస్థితి ఉంది. శింభుతో మొదలైన నయనతార ప్రేమ ప్రయాణం ఆ తర్వాత ప్రభుదేవా ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ తో నడుస్తుంది.
మరి విఘ్నేష్ తో చూస్తుంటే ఇదేదో పెళ్లి దాకా వెళ్లేలానే కనిపిస్తుంది. ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్ సర్సన బాబు బంగారం సినిమాలో నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకోగా జూలై నెలలో సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.