నిన్న రాత్రి జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రేత్ చేసిన హంగామాకు ఆ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతున్న ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమ్రోగి పోయింది. పెద్దపెద్ద అవార్డ్స్ ఫంక్షన్ లో అవకాశం దొరికితే చాలు హీరోయిన్స్ తమ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లతో అదరగోట్టేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ లో కూడ మెగా హీరోల సినిమాల పాటల హడావిడి కనిపిస్తోంది.
ఈమధ్య ‘కంచె’ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సిని ‘మా’ అవార్డ్స్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి పాత సినిమా పాటలకు ఒక మెడ్లీ వేస్తే ఈ విషయంలో తాను కూడ తక్కువ కాదు అంటూ రకుల్ ప్రీత్ ఏకంగా పవన్ కళ్యాణ్ కే షాక్ ఇచ్చింది. పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో చిరంజీవి వీణ స్టెప్ వేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఈ సినిమా అందరికీ నచ్చకపోయినా పవన్ వీణ స్టెప్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఆ సినిమాలో పవన్ వీణ స్టెప్ గురించి ఎదురు చూసారు. అంత క్రేజ్ ఉన్న ఈ వీణ స్టెప్ ను రకుల్ అనుకరించి ఫిలిం ఫేర్ అవార్డుల ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారిపోయింది.
వీటితో పాటు ‘బ్రూస్ లీ’ ‘సరైనోడు’ సినిమాలలోని కొన్ని పాటల స్టెప్పులను కలిపి తాను కూడ మెగా హీరోయిన్ నే అంటూ మరోసారి తెలియ చేయడానికి ప్రయత్నించింది.
రకుల్ గ్లామర్ తో పాటు స్పీడ్ గా వేసిన ఆమె స్టెప్పులను చూసి ముందు వరసలో కూర్చున్న రామ్ చరణ్ అల్లుఅర్జున్ రానాలు చప్పట్లతో ఈలలతో గోల చేసారు అంటే రకుల్ ప్రీత్ ఏ రేంజ్ లో హడావిడి చేసిందో అర్ధం అవుతుంది. దీనికితోడు ఈమె వెనుక డాన్స్ లు చేసిన ప్రణీత హరిప్రియలు కూడా రకుల్ తో శ్రుతి కలపడంతో టాప్ హీరోయిన్స్ అంతా మెగా భజన చేస్తున్నారు అన్న కామెంట్స్ ఆ ఫంక్షన్ లో వినిపించాయి..