ఉపాసనకు దూరమవుతున్న చరణ్

HANUMA HANUMA
చరణ్ తన చిరకాల మిత్రురాలు ఉపాసనను పెళ్ళి చేసుకున్న నాటి నుంచీ బిజీగానే ఉన్నాడు. మూడు రోజుల హనీమూన్ నుంచి వచ్చాక వెంటనే జంజీర్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ 15 రోజులు తన ఇల్లాలికి దూరంగా ఉండబోతున్నారు చరణ్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ 20 నుంచి కోల్ కతాలో జరగనుంది. ఈ షూటింగ్ కోసం చరణ్ వెళ్ళనున్నారు. అమలాపాల్, చరణ్ పై కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారట. ఏదేమైనా నవ దంపతులకు ఎడబాటు తప్పడం లేదన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: