సూర్య మరో బాహుబలి చేస్తున్నాడా..!

shami
విలక్షణ నటుడు 24 సినిమా హిట్ అవడంతో తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. 24లో ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పిన సూర్య ప్రస్తుతం సింగం-3 షూట్ లో ఉన్నాడు. ఇక ఆ సినిమా తర్వాత ఓ భారీ సినిమా ప్లాన్ లో ఉన్నాడు సూర్య. సి.సుందర్ దర్శకత్వంలో ఓ పొరాణిక చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట సూర్య.


24 లో సూర్య :


ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు ముగిసినట్టు తెలుస్తుంది. అంతేకాదు సూర్య 24 సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకున్నడు. సో ఈ లెక్కన తన మీద ఎంత పెట్టినా కచ్చితమైన రిటర్న్స్ వస్తాయన్న భావనతోనే సూర్యతో ఈ ప్రయోగానికి దిగితున్నారు దర్శకుడు సుందర్ సి. అంతేకాదు ఈ సినిమాలో ఇంకా భారీ కాస్టింగ్ కూడా ఉంటుందని అంటున్నారు.


శ్రీ తెండ్రిల్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై నిర్మాతలు ఏకంగా 250 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే రోబో 2.0 కూడా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నట్టు తెలిసిందే. మరి రజినికి పోటీగా సూర్యతో ఆ రేంజ్ బడ్జెట్ అంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అంతేకాదు సినిమా అంతా టెక్నికల్లి అడ్వాన్స్డ్ గా ఉంటుందని అంటున్నారు.


సూర్య షూటింగ్ స్పాట్ పిక్ :


సింగం-3 తర్వాత ఇలాంటి సినిమా ఒప్పుకోవడం పట్ల సూర్య తన స్టామినాను పెంచుకునే విధంగా అనిపిస్తుంది. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య తమిళ్ లో మాత్రం కాస్త వెనుకబడి ఉన్నాడు. విజయ్, రజిని, అజిత్, విక్రం లాంటి హీరోల తర్వాత సూర్య స్టార్స్ గా ఉన్నారు. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాతో సూర్య కూడా కోలీవుడ్ నెంబర్ 1 హీరో అవుతాడేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: