ఈవారం భారీ అంచనాలతో విడుదల అవుతున్న 'బ్రహ్మోత్సవం' సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్ భయ పెడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్ హిట్ తరువాత మహేష్ బాబుతో తీసిన ఈ సినిమా ఎట్టి పరిస్తుతలలోను బ్లాకు బస్టర్ హిట్ కొడుతుంది అని శ్రీకాంత్ అడ్డాల చాలా నమ్మకం పై ఉన్నా ఒక సెంటిమెంట్ మాత్రం శ్రీకాంత్ అడ్డాలను బాగా భయ పెడుతోంది అని టాక్.
ఆసక్తికరమైన ఈ సెంటిమెంట్ వివారలలోకి వెళ్ళితే కొన్నిఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తాయి. మహేష్‌తో తమ రెండో చిత్రాన్ని తీసి హిట్ కొట్టిన దర్శకుడు తన నాలుగో చిత్రాన్ని మహేష్ తో తీస్తే ఆ సినిమా విజయవంతం కాదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో నడుస్తోంది. దీనికి ఉదాహరణగా గతం లో మహేష్ తో 'అతడు' సినిమాను తన రెండో సినిమాగా చేసి హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్. 'ఖలేజా'ను మహేష్ తో నాలుగో సినిమాగా చేస్తే అది భయంకరమైన ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలది కూడ ఇదే పరిస్థితిగా మారుతుందా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
మహేష్ తో రెండో సినిమాని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' గా చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు తన నాల్గవ సినిమాగా తిరిగి మహేష్ తో 'బ్రహ్మోత్సవం' చేస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్స్ కు సంబంధించి ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న ఈ సెంటిమెంట్ కామెంట్స్ శ్రీకాంత్ అడ్డాలకి తీవ్ర టెన్షన్ క్రియేట్ చేస్తున్నట్లు టాక్.
ఇది ఇలా ఉండగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీకాంత్ అడ్డాలకు సొంత కారు కూడ లేదు అని మహేష్ బయట పెట్టిన న్యూస్ ఫిలింనగర్ లో షాకింగ్ న్యూస్ గా మారింది. ఇప్పడు ఎక్కడ చూసినా శ్రీకాంత్ అడ్డాల నిరాడంబరత గురించి చాలామంది చర్చించు కుంటున్నట్లు టాక్. ఏది ఏమైనా త్రివిక్రమ్ సెంటిమెంట్ ని శ్రీకాంత్ అడ్డాల అధిగ మిస్తాడో లేదో చూడాలి..