సునీల్ మరోసారి ఆ దురద తీర్చుకుంటున్నాడా..!

shami
స్టార్ కమెడియన్ నుండి సడన్ గా హీరోగా టర్న్ అయిన సునీల్ మొదట్లో తన కామెడీ వేశాలతో అందాల రాముడు లాంటి సినిమాలతో హిట్ అందుకున్నా ఎప్పుడైతే తానో మాస్ హీరో అవ్వాలనుకున్నాడో అప్పటినుండి సారుకి కష్టాలు మొదలయ్యాయి. పూలరంగడులో సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. ఆ సినిమా ఎలాగోలా గట్టెక్కింది. ఇక అప్పటినుండి సినిమా ఏదైనా సునీల్ సిక్స్ ప్యాక్ చూపిస్తూనే ఉన్నాడు.


రీసెంట్ గా వచ్చిన కృష్ణాష్టమిలో కూడా సునీల్ ఓ సీన్ లో అవసరం లేకున్నా ఆరు పలకల దేహాన్ని చూపించాడు. అయినా సరే ఫలితం మాత్రం ఎప్పటిలానే నిరాశ పరుస్తుంది. అయినా సరే మరోసారి ఆ సరదా తీర్చుకుంటున్నాడట సునీల్. ప్రస్తుతం నటిస్తున్న జక్కన్న సినిమాలో కూడా సునీల్ సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తున్నాడట.


సునీల్ జక్కన్న ఫస్ట్ లుక్ :


వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సునీల్. ప్రియాంక కజిన్ బార్బీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తనలోని కామెడీ యాంగిల్ ను వాడకుండా ఇలా స్టార్ ఇమేజ్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సునీల్ ఈసారైనా హిట్ కొడతాడో లేదో చూడాలి.


సునీల్ ను ఇప్పటికీ ఓ కమెడియన్ గా చూసే.. చూడాలనుకునే ఆడియెన్స్ ఉన్నారు. మరి వారి కోసం హీరోగా చేస్తూనే కమెడియన్ గా కూడా మారితే సునీల్ ఇమేజ్ ఈమాత్రమన్నా నిలబడే అవకాశాలు ఉన్నాయి. మరి సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ జక్కన్న సినిమా ఏం చేస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: