నదియా బయట పెట్టిన త్రివిక్రమ్ పిలుపు !

Seetha Sailaja
గ్లామర్ క్వీన్ గా 1990 ప్రాంతాలలో టాలీవుడ్ కోలీవుడ్ లను షేక్ చేసిన నదియాకు పిలిచి అవకాశం ఇవ్వడమే కాకుండా నదియాకు తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక క్రేజ్ ఏర్పరచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నడియాకు విపరీతమైన గౌరవం. ఈమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నదియా తాను లేటెస్ట్ గా నటిస్తున్న ‘అ ఆ’ సినిమా విశేషాలతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకున్న అనుభందాన్ని వివరించింది నదియా. 

‘అ ఆ’ సినిమాలో సమంతకు తల్లిగా నటిస్తున్న తన పాత్ర గురించి వివరిస్తూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని సునంద పాత్రలా ‘అ ఆ’ సినిమాలో కూడ తన పాత్ర ఉంటుంది అని చెప్పింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర మటుకు కొంత కామిక్ టచ్ తో హాస్యంగా ఉంటుందని తన పాత్ర గురించి లీకులు ఇచ్చింది నదియా. 

ఇదే సందర్భంలో ‘అ ఆ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆ సక్తికర విషయాన్ని బయట పెట్టింది. ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ తనను ఎప్పుడూ ‘ఓల్డ్ లేడీ’ అంటూ ఆట పట్టిస్తూ తనను పిలిచిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. దీనితో షాక్ అయిన నదియా త్రివిక్రమ్ అలా ఎందుకు పిలుస్తున్నారో అర్ధంకాక ఒకసారి ధైర్యం చేసి తాను త్రివిక్రమ్ ను అడిగితే త్రివిక్రమ్ చెప్పిన విషయం విని తన మైండ్ బ్లాంక్ అయింది అని అంటోంది నదియా.  

త్రివిక్రమ్ అలా పిలవడంలో ఒక కారణం ఉందట. నదియా మంచి టాలెంట్ ఉన్న నటి కావడంతో ఆమె తనకు 80 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు సినిమాలలో నటిస్తూనే ఉండాలనే కోరికతో తాను అలా నదియాను ‘ఓల్డ్ లేడీ’ అని అభిమానంగా పిలుస్తున్నాను అని చెప్పి షాక్ ఇచ్చాడట మన మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ ఆలోచన బాగానే ఉన్నా గ్లామర్ అమ్మలకు డిమాండ్ పెరిగి పోతున్న నేటి రోజులలో నదియాకు 80 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఎవరు అవకాశాలు ఇస్తారు అన్నదే ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: