పవన్ చిరంజీవిల కలయికతో మొదలైన మెగా ఫ్యామిలీ ఐక్యత మరింత గట్టి పడుతోంది. ఈమధ్య కాలంలో నాగబాబు చిరంజీవితో దూరంగా ఉంటున్నాడు అన్న అనుమానాలను తీరుస్తూ రామ్ చరణ్ ఇప్పుడు ఏకంగా నిహారికను ప్రమోట్ చేయడానికి ముందుకు రాబోతున్నాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈనెల 27న జరగబోతున్న నిహారిక ‘ఒక మనసు’ ఆడియో లాంచింగ్ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిదిగా రాబోతున్నాడని టాక్.
వచ్చే నెల విడుదల కాబోతున్న ఈసినిమా ఆడియో వేడుకను చాల ఘనంగా నిత్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పవన్ లు తప్ప ఈ కార్యరమానికి మెగా యంగ్ హీరోలు అంతా రాబోతున్నారని తెలుస్తోంది. ఆమధ్య కాలంలో నిహారిక టాలీవుడ్ ఎంట్రీకి మెగా కుటుంబం అంతా కొంత దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆ గాసిప్పులకు విరుగుడుగా ఈ మెగా షోను తీర్చిదిద్దు తున్నట్లు తెలుస్తోంది.
నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈసినిమాను దర్శకుడు రామరాజు చాల క్రియేటివ్ గా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను టివి9 ఛానల్ నిర్మిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా భారీ ఎత్తున యూత్ ను ఆకర్షించే విధంగా చేయబోతున్నారని టాక్.
సమ్మర్ రేస్ కు భారీ సినిమాలతో పోటీ పడుతూ విడుదల అవుతున్న ఈసినిమా అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే ఇప్పటి దాకా మెగా డాటర్ గా ఉన్న నిహారిక ‘మెగా ప్రిన్సెస్’ గా మారిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..