100 కోట్ల ఊపిరిని పోస్తున్న సర్దార్ గన్ !

Seetha Sailaja
‘సర్దార్ గబ్బర్ సింగ్’ మ్యానియా మొదలు అయినప్పుడు నాగార్జున ‘ఊపిరి’ కి సమస్య ఏర్పడుతుంది అనుకున్నారు అంతా. అయితే ‘సర్దార్’ గన్ పేలకపోవడంతో ‘ఊపిరి’ 100 కోట్ల సినిమాగా మారబోతోంది అన్న కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి. నిన్న సాయంత్రం జరిగిన ‘ఊపిరి’ సక్సస్ మీట్ లో ఈ మాటలు ఎక్కువగా వినిపించాయి అని టాక్. 

‘ఊపిరి’ విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఇప్పటికి ఇంచుమించు 80 కోట్ల కలక్షన్స్ మైలురాయి దగ్గరకి చేరిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘సర్దార్’ ఘోర పరాజయం చెందడంతో టాప్ హీరోల సినిమాలు చూడాలి అని అనుకునే వారికి ‘ఊపిరి’ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఈరోజు నుంచి వరసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో పాటు పెద్ద హీరోల సినిమాలు ఏమి ప్రస్తుతం పోటీకి లేకపోవడంతో ‘ఊపిరి’ 100 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలకు తగ్గట్టుగా ఎక్కడా ‘ఊపిరి’ కలక్షన్స్ డౌన్ కాకుండా ఉండటంతో నాగార్జున మంచి జోష్ లో ఉన్నాడని నిన్న సక్సస్ మీట్ లో నాగార్జున ఆనందాన్ని చూసిన వాళ్ళకు ఎవరికైనా అర్ధం అవుతుంది. అక్కినేని అభిమానులు పాల్గొన్న ఈ ‘ఊపిరి’ సక్సస్ మీట్ అత్యంత ఘనంగా జరిగింది.

ఇదే సందర్భంలో నాగార్జున మాట్లాడుతూ మరో రెండు నెలలలో  కళ్యాణ్ కష్ణ, నాగచైతన్యతో ఓ సినిమా మొదలు పెట్టడం, వంశీని, అఖిల్ ను కూర్చోపెట్టి కథను ఫైనల్ చేయించడం కూడా ఈ రాబోతున్న రెండు నెలల్లోనే జరగబోతున్నాయి అంటూ తాను ఇంతకు ముందు తన ఇద్దరి కొడుకుల కెరియర్ పై మనసు పెట్టలేదని ఈ ఏడాది అంతా అదే పని పై ఉంటాను అంటూ అక్కినేని అభిమానులకు జోష్ ను ఇచ్చాడు నాగార్జున. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దాసరి కూడ పాత విషయాలను మరిచిపోయి అక్కినేని కుటుంబ భజన చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: