షాకింగ్ సమస్యతో బాధ పడుతున్న నారా రోహిత్ !

frame షాకింగ్ సమస్యతో బాధ పడుతున్న నారా రోహిత్ !

Seetha Sailaja
ప్రస్తుత తరం యంగ్ హీరోలు ఎవరూ నటించనంత స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఈ సంవత్సరం 7  సినిమాలు విడుదలచేయాలి అని పరుగులుతీస్తున్న నారా రోహిత్ ఒకప్పుడు టాప్ హీరోలుగా టాలీవుడ్ ను ఏలిన చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ లా ఒకే సంవత్సరం అత్యధిక సినిమాలు విడుదల చేయడం ఈహీరోకు రికార్డ్ గా మారుతోంది. రెండు వారాల క్రితమే ‘తుంటరి’ గా వచ్చిన  నారా రోహిత్ రాబోతున్న ఏప్రియల్ 1న ‘ఫూల్స్ డే’ నాడు ‘సావిత్రి’ సినిమా ద్వారా మరొకసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. 

గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాను తీసిన పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా పై ఫిలిం నగర్ లో ప్రీ పాజిటివ్ టాక్ ఉంది. ఆశ్చర్యకరం ఏమిటంటే ఈసినిమాలో హీరో పాత్రను చేస్తున్న నారా రోహిత్ కు ఒక విచిత్రమైన జాతక సమస్య ఉందట. అందువల్ల అటువంటి జాతక సమస్య ఉన్న అమ్మాయిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలని లేదంటే ప్రాణానికి ప్రమాదం అని జ్యోతిష్కుడు చెప్పడంతో నారా రోహిత పడే పాట్లు చుట్టూ ఈసినిమా కథ తిరుగుతుంది అని టాక్.

అయితే ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నందిత తనకు పెళ్ళి పిచ్చి పెరిగి పోవడంతో తన అక్క పెళ్ళి చెడగొడితే ఆ పెళ్ళి కొడుకును తనకు ఇచ్చి పెళ్ళి చేస్తారేమో అన్న ఉద్దేశ్యంతో నందిత తన అక్క పెళ్ళి చెడగొడుతుంది. ఆ తరువాత ఈకథ అనేక ట్విస్టులు తీసుకోవడం ఒక ట్రైన్ ప్రయాణంలో నందితకు నారా రోహిత్ పరిచయం కావడం ఆపై ప్రేమలో పడటం ఇలా ఎన్నో ట్విస్ట్ లు ఈకథలో ఉన్నాయి అని అంటున్నారు. 

ఇలా ఒకదిఫరెంట్ కథగా ఈవారం విడుదల కాబోతున్న ఈసినిమా టైటిల్ పై దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ చాలామంది తనను ఈసినిమాకు ‘సావిత్రి’ అనే పేరు ఎందుకు పెట్టావు అని అడుగుతున్నారని ‘సావిత్రి’ పేరులో మాస్ అపీల్ లేదు కదా అంటూ తనను ప్రశ్నిస్తున్న విషయాన్ని బయట పెట్టి మరో షాక్ ఇచ్చాడు దర్శకుడు పవన్. అయితే ‘సావిత్రి’ అన్న పేరు తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన పేరు కాబట్టి ఈ సాహసం చేసాను అంటున్నాడు పవన్. ‘సర్దార్ సినిమాకు కేవలం ఒకే ఒక వారం ముందు విడుదల అవుతున్న ఈసినిమా ‘సర్దార్’ ఉప్పెనను తట్టుకుని నిలబడగలిగితే నారా రోహిత్ కు ఎదురు లేదని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: