స్కూళ్ళకి వెళ్తున్న నాయికలు

HANUMA HANUMA
 ఒక్కో సారి ఒక్కో ట్రెండ్ రాజ్యమేలుతుంటుంది. తాజాగా కెరీర్ లో అడుగుపెట్టిన ప్రతి నాయికా తాను ఓ సందర్భంలోనైనా స్కలూ యూనిఫారంలో మెప్పించాలని తాపత్రయపడుతోంది. ‘ఆకాశమంతా’లో త్రిష యూనిఫారంతో నాజూగ్గా కనిపించింది. ‘వల్లభ’లో రిమాసేన్, సంధ్య కూడా ప్రేక్షకుల మన్ననలను పొందారు. హన్సిక కూడా బొద్దుగా ఉన్నా చదువుకునే అమ్మాయిగా మంచి మార్కుల్ని కొట్టేసింది. ప్రియమణి ‘పరుత్తివీరన్’ (తెలుగులో మల్లిగాడు)లొ లంగాఓణీతో కనిపించింది. కెరీర్ తొలినాళ్ళలో అయ్యా సినిమాలో నయనతార కూడా ఆ తరహా డ్రస్సులో ముచ్చట తీర్చుకుంది. అమలాపాల్ తన తొలి చిత్రంలోనే స్కూలుకు వెళ్ళే మగువగా నటించింది. శ్రుతిహాసన్ ఇటీవల త్రీలో రెండు జళ్ళతో అలాంటి పాత్రనే చేసింది. తాజాగా ఎటో వెళ్ళిపోయింది మనసులోనూ సమంత ఈ ముచ్చట తీర్చుకుందట మరి. నాయికలందరూ ఒకరి వెనక ఒకరు కాలేజీలను వదిలేసి స్కూలు బాట పడుతున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: