హాట్ బ్యూటీ ఈసారైనా హిట్ కొడుతుందా..!

shami
టాలీవుడ్ కొందరికి రెడ్ కార్పెట్ పరుస్తుంటే మరికొందరికి మాత్రం ఐరన్ లెగ్ ముద్ర వేస్తుంది. వారు ఎంచుకునే సినిమాల ప్రభావం ఒకటైతే వారిని వెంట తడుముతున్న బ్యాడ్ లక్ అలా వారిని వెనక్కి పడేస్తుంది. ప్రస్తుతం హాట్ బ్యూటీ అదా శర్మ పరిస్థితి ఇలానే ఉంది. బాలీవుడ్ సినిమా 1920 సినిమాలో సూపర్ యాక్టింగ్ తో అదరగొట్టిన అదా పూరి డైరక్షన్లో హార్ట్ ఎటాక్ అంటూ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది. 


అయితే సినిమాల ఎంపికలో తప్పుడు తడకలతో అమ్మడు వచ్చిన ఇమేజ్ ని కాస్త డ్యామేజ్ చేసుకుంది. హీరోయిన్ గా చేయాల్సిన టైంలో ఏవేవో చిన్నా చితకా పాత్రలు చేసుకుంటూ పోయి ఇప్పుడు కోల్పోయిన ఇమేజ్ ను తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అదా నటించిన గరం రీసెంట్ గా రిలీజ్ అయినా అదాకు అంత ఉపయోగపడలేదు. ఇక లేటెస్ట్ సినిమా క్షణం మీదే అన్ని ఆశలు పెట్టుకుంది అదా శర్మ.


క్షణం సినిమాలో అదా శర్మ :


క్షణం సినిమాలో లీడ్ రోల్ చేసిన అదా శర్మ సినిమా మొత్తం తన మీదే నడవడం గొప్ప విషయం. మరి ఈ సినిమా అయినా అదాకు మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. పివిపి నిర్మాణంలో రవికాంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటించాడు. హాట్ యాంకర్ అనసూయ ఇందులో డిఫరెంట్ గా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ మొత్తం సినిమా విజయం మీద నమ్మకంతో ఉన్నారు. దాదాపు డబ్బింగ్ సినిమాలు చిన్న సినిమాలు కలిపి రేపు రిలీజ్ అవుతున్న 8 సినిమాల్లో క్షణం సినిమా మీదే ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో రేపు సాయంత్రం కల్లా తెలుస్తుంది. ఇదే బ్యానర్ నుండి వస్తున్న ఊపిరి సినిమా కూడా మార్చ్ 25న రిలీజ్ అవనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: