ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన బాహుబలి సినిమా ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్లే అవుతుంది. ఇప్పటికే సినిమా మీద క్రేజ్ తో అందరు మా టివి ట్యూన్ చేసుకున్నారు. ముందునుండి సినిమా పండుగకు వస్తుందన్న ప్రోమోని వదలడం వల్ల సినిమా కోసం అందరు టీవీల ముందు కూర్చుని ఉన్నారు. సినిమాతో పాటుగా మా టీవీ వారు కాంటెస్ట్ కూడా నిర్వహించడం విశేషం. మధ్య మధ్యలో మా టివి వారు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం సెండ్ చేస్తే వారికి ప్రైజేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
సినిమా బ్రేక్ టైంలో సినిమా చేయడానికి రాజమౌలి అండ్ అతని టీం సినిమా కోసం ఎంత కష్టపడ్డారని చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ అన్ని చాలా కష్టపడి తీశారు. అందుకే సినిమా రికార్డుల వర్షం కురిపించింది. దాదాపు బాలీవుడ్ సినిమా ధీటుగా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ ఇండియన్ మోస్ట్ కలెక్టెడ్ మూవీగా సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
బాహుబలి సినిమాలో ప్రభాస్ రానా :
రాజమౌలి మాత్రమే చేయగల ఇలాంటి ప్రాజెక్ట్ ని ప్రభాస్ మాత్రమే చేయగలడు అనిపించేంతలా చేశాడు. రాణా అనుష్క తమన్నాలు కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మా టీవీలో ప్రసారమవుతున్న బాహుబలికి ముందు అనుకున్నట్టుగా 10 సెకన్ల యాడ్ కు దాదాపు 2.5 లక్షలను వసూలు చేశారు. ఇక అందరు టీవీలకు అతుక్కుపోయారు కాబట్టి ఈరోజు టీఆర్పి రేటింగ్ కూడా అదిరిపోయే ఛాన్స్ ఉంది.