మనీ: ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఎలు ప్రకటించిన ఏపీ సీఎం..!!
అసెంబ్లీ పార్లమెంట్లు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.గతంలో దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు డిఏ ప్రకటించారు.. ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న తరుణంలో అనంతరం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా త్వరలోనే ఎలక్షన్ కోడ్ కూడా అమలులోకి రాబోతోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే అవకాశం ఉంటుందని భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అందుకు సంబంధించి చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది.
ఒకటి రెండు రోజులలో ఎన్నికల ప్రకటన కూడా రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలిగించి నిర్ణయాలను మాత్రమే ఏపీ సీఎం తీసుకుంటున్నారు. అలాగే అంగన్వాడీలకు కూడా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది 42 రోజులపాటు సమ్మె చేసినప్పటికీ వారి జీతాలను కూడా చెల్లించే బోతున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు.. డిసెంబర్ 12వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు అంగన్వాడీలు సమ్మె చేయడంతో దాదాపుగా 42 రోజులపాటు ఈ సమ్మె కొనసాగించారు. ఈ వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లను కూడా పరిష్కరించారు. ఇలా ఎన్నికలు రాబోతున్న సమయంలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.