ఓరి నాయనో.. నిమ్మకాయ రూ.35వేలు.. ప్రత్యేకత ఏంటంటే?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వాలిపోతుంది. దీంతో ఇక కూర్చున్న చోటు నుంచి ప్రపంచాన్ని మొత్తం చదివేయగలుగుతున్నాడు మనిషి. అయితే ఇంటర్నెట్ లోకి వచ్చే ఎన్నో ఆసక్తికర విషయాలు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైన ఘటన గురించే. సాధారణంగా నిమ్మకాయ ధర ఎంత ఉంటుంది అంటే.. మహా అయితే ఐదు రూపాయలు ఉంటుందని చెబుతారు ఎవరైనా.

 ఇక ఆ నిమ్మకాయలో ఏదైనా స్పెషలిటీ ఉంటే 100 లేదంటే 200 రూపాయలు ఉంటుంది అని సమాధానం చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే నిమ్మకాయ మాత్రం వెరీ కాస్లీ. ఒకవేళ అన్ని నిమ్మకాయల్లాగానే ఈ నిమ్మకాయను కూడా అన్నంలో కలుపుకొని పులిహోర చేసుకోవాలి అనుకున్నారు అంటే.. మీరు దాదాపు 35వేల రూపాయలు లాస్ అయినట్టే. ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమ్మకాయ ఖరీదు 35000 రూపాయలు. వినడానికి షాకింగ్ గా ఉంది కదా. కానీ ఇక్కడ నిజంగానే ఇది జరిగింది. అయినా నిమ్మకాయ ఖరీదు 35000 ఏంటి అందులో ఏం స్పెషాలిటీ ఉంది అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది.

 అయితే ఇది షాపుల్లో దొరికే సాధారణ నిమ్మకాయ కాదు.. ఏకంగా శివరాత్రి నాడు శివుడికి అలంకరించిన నిమ్మకాయ. తమిళనాడులోని ఈరోజ్జి జిల్లా శివగిరి సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో ఇక శివరాత్రి రోజున పూజల నిర్వహించారు. ఆ తర్వాత దేవుడికి సమర్పించిన వస్తువులని వేలం వెయ్యడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ రోజ్జికు చెందిన ఒక భక్తుడు ఏకంగా స్వామివారి పూజలో ఉంచిన నిమ్మకాయను 35వేల రూపాయలకు వేలంలో పోటీపడి మరి దక్కించుకున్నాడు. ఈ నిమ్మకాయను పొందిన వారు ధనవంతులు ఆరోగ్యవంతులు అవుతారని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకేఇక ఈ నిమ్మకాయ కోసం పోటీపడి మరీ వేలంలో భారీ ధర పెట్టేందుకు కూడా సిద్ధమవుతూ ఉంటారట భక్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: