మనీ: ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!!

Divya
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజల కోసం ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన , ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాలను కూడా తీసుకువచ్చింది. అయితే ఇది వరకు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.. అయితే అతిపెద్ద ప్రభుత్వ రంగం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా వంటి పథకాల కోసం నమోదు చేసుకోవడానికి బ్యాంకుకు రావలసిన పనిలేదంటూ ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చంటూ తెలియజేశారు.

ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ రెండు పథకాలను సులభంగా చేసుకుని విధంగా తమ కస్టమర్లకు మరొక ఎనేబుల్ను తీసుకువచ్చింది ఎస్బిఐ.. ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించిన ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం కింద రూ .2లక్షల రూపాయలు అందుతుంది.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ .2లక్షలు  లేదా ఏదైనా వైకల్యం ఏర్పడితే
.. ఒక లక్ష రూపాయలు రక్షణగా ఈ పథకం ఉంటుందట. వీటికి 12 రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది.అయితే ఒక ఏడాది మాత్రమే ఈ పథకం ఉంటుంది. ప్రతి ఏడాది వీటిని పునరుద్దించుకునే అవకాశం ఉంటుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 70 సంవత్సరాల వరకు ఈ పథకంలో ఉండవచ్చు.

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా వయసు విషయానికి వస్తే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య కలిగిన ఎవరైనా సరే వీటిని వినియోగించుకోవచ్చు..రెండు లక్షలు బీమా తో పాటు ఒక సంవత్సరం జీవిత బీమాను కూడా అందిస్తుంది.. 2015 లో కేంద్ర ప్రభుత్వం జీవన్ జ్యోతి బీమాను ప్రారంభించింది ప్రతి ఏటా రూ .436 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే.. అంటే నెలవారీగా చూసుకుంటే 35.3 రూపాయలు ఒక వ్యక్తికి పడుతుంది దీంతో మీరు రూ .2లక్షల ప్రమాద బీమా ని కూడా పొందవచ్చు. ఈ పథకం మే ఒకటి నుంచి జూన్ 31 వరకు మాత్రమే ఉంటుంది.. ఎవరైనా వ్యక్తి మరణిస్తే 2 లక్షల రూపాయలు అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: