మనీ: ఈనెల 31 న వీటికి డెడ్ లైన్.. వెంటనే పూర్తి చేయండి..!!

Divya
కొద్ది రోజుల వ్యవధిలోని 2023 క్యాలెండర్ మారిపోయి 2024 సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.. కొత్త ఈ యేడాదికి ఆహ్వానం పలికేందుకు సైతం ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు.. ఇలా కొత్త ఏడాది ప్రారంభమవుతూ ఉంటే పలు రకాల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి.. సరికొత్త నిబంధనలు కూడా అమలులోకి వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పనులు కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే లోపే పూర్తి చేయవలసి ఉంటుంది. అలాంటి వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

1). ఇన్ ఆక్టివ్ యూపీఐ ఐడిలు:
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. తెలిపిన ప్రకారం ఒక ఏడాది కంటే ఎక్కువ యాక్టివ్గా లేని యూపీఐడీలు డిఆర్టివేషన్ చేస్తాయట. అందుకే డిసెంబర్ 31 లోపు వీటిని యాక్టివేషన్ చేసుకోవాలి.


2) బ్యాంకు లాకర్:
Rbi మార్గదర్శకాల ప్రకారం సేఫ్ డిపాజిట్ లాకర్ల కోసం సరికొత్త నిబంధనలను వినియోగదారులకు తీసుకురావడం జరిగింది. కస్టమర్లు అద్దె చెల్లించినంత కాలం వరకే లాకర్లు ఉపయోగించుకొని సదుపాయం కలదు. అలా ఏడాది చివరికి అయిపోతుందని అందుకే ఈనెల 31 తో ఈ గడువు ముగియనుంది తెలియజేస్తున్నారు.

3).ITR filing:
2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్లను పెనాల్టీతో సహా కట్టడానికి చివరి తేదీ ఈ నెల 31.. సెక్షన్ 234 F ప్రకారం గడువు తేదీలోపు కట్టాల్సి ఉంటుంది.. ఒకవేళ ఆలస్యం అయితే 5,000 వరకు ఉంటుంది.

4).simcards kyc :
మొబైల్ వినియోగిస్తున్న వారందరూ పేపర్ ఆధారిత  కేవైసీని మొదలుపెట్టడం జరుగుతుంది. జనవరి ఒకటవ తేదీ నుంచి వీటిని తీసేసి పేపర్ అవసరం లేకుండానే బయోమెట్రిక్ ఆధారంగా కేవైసీని సిమ్ కార్డులను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తోంది .అందుకే ఈనెల 31 తో ఈ గడువు ముగియనుంది తెలియజేస్తున్నారు. .ఇవే కాకుండా ఇతరత్రా వాటిని కూడా పూర్తి చేసేందుకు ఈనెల 31 వరకే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: