మనీ: వారికి నెల నెల 11,500 జమ చేస్తున్న ఏపీ సీఎం..!!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు శుభవార్తను తెలియజేయడం జరిగింది.. వారి యొక్క జీవన శైలి పెంచడం కోసమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మరింత మేలు చేసే విధంగా మూడు కార్యక్రమాలను సైతం ఏపీ సీఎం శ్రీకారం చుట్టడం జరిగింది.. తిరుపతి జిల్లాలో రాయదరువు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ నుంచి పలు అభివృద్ధి పనులకు సైతం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.


Ongc, GSPc సంస్థల పైప్లైన్ పనుల కారణాలు చేత జీవనోపాధి లేకుండా పోయిన వారికి నాలుగో విడత కింద 11,500 చొప్పున ఆరు నెలలకు 69 వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. దీని ద్వారా 161.86 కోట్ల రూపాయలు ఖర్చుతో నేరుగా లబ్ధిదారులకు వారి యొక్క అకౌంట్లకు జమ చేసే విధంగా ఉంటుందట..ONGC వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి దాదాపుగా 490 కోట్ల రూపాయల పరిహారం చెల్లించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే 40,000 మంది జీవన ఉపాధి కోల్పోయిన GSPC  దెబ్బ తినడం వల్ల దాదాపుగా 16,500 మందికి 80 కోట్ల రూపాయల సహాయాన్ని ఇప్పటికే అందించినట్లు తెలియజేశారు.


తిరుపతి జిల్లా పాకాల మండలంలో 24 కోట్లతో ఒక షిఫ్ట్ ల్యాండింగ్ సెంటర్ ని సీఎం జగన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సెంటర్ ఏర్పాటు వల్ల సురక్షితంగా 500 మంది మెటా రైడ్స్, మెకానైట్ బోట్లు నిలుపుకొని అవకాశం ఉంటుందట. దెబ్బతిన్న బోట్లకు కూడా అక్కడే మరమ్మత్తులు చేసుకొని వెలుసుబాటు కూడా ఉంటుంద5ట .దీని ద్వారా 20,000 మంది మత్స్యకార  కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. అయితే ఇందుకోసం ఐదు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇవే కాకుండా వివిధ పథకాల ద్వారా 2,18,153 మందికి లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా రామయపట్నం, మచిలీపట్నం, మూలపేట కాకినాడ వద్ద పలు రకాల కోర్టులను సైతం నిర్మించడానికి శ్రీకారం చుట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: