బ్యాంకుకు వెళ్లకుండానే.. రూ.2 వేల నోట్లు ఇలా మార్చుకోవచ్చు?

praveen
పెద్ద నోట్ల రద్దు.. ఇది ఇండియానే ఊపేసిన ఒక సంచలనం నిర్ణయం. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఎంతలా ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నల్లధనాన్ని కుప్పలు తెప్పలుగా దాచుకున్న ఎంతోమంది సంపన్నులు అయితే ఇక అప్పటివరకు సంపాదించిన సొమ్ము పై ఆశలు వదిలేసుకున్నారు. ఏకంగా రోడ్లపై డబ్బులను చిత్తు కాగితాల్లాగ  పారబోసిన పరిస్థితి కూడా అప్పట్లో కనిపించింది. అయితే ఇలా పెద్ద నోట్లను రద్దుచేసి కొత్తగా 2000, 500 రూపాయలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.


 దీంతో ఇక మరోసారి ఇలాంటి పెద్ద నోట్ల రద్దు షాకింగ్ నిర్ణయం ఉండకపోవచ్చు అని భారత ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో ఏకంగా 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ అటు మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీంతో 2000 రూపాయలు నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడం కోసం.. సెప్టెంబర్ 31 వరకు కూడా ఛాన్స్ ఇచ్చింది. అయితే ఇప్పటికి కొంతమంది తమ వద్ద ఉన్న ₹2,000 నోట్లోను మార్చుకోకుండా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారి కోసం ఇటీవల bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది అని చెప్పాలి.


 ఏకంగా బ్యాంకుకు వెళ్లకుండానే ₹2,000 నోట్లోనూ మార్పులు చేసుకోవచ్చు అంటూ తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పోస్ట్ ఆఫీస్ లో నోట్ల మార్పిడి చేసుకోవచ్చు అంటూ తెలిపింది. పోస్ట్ ద్వారా పంపే కవర్ లో 2000 రూ.. నోట్లతో పాటు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆర్బిఐ కి పంపాలి. ఇక ఈ నోట్లు వారికి చేరిన వెంటనే మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. టీఎల్ఆర్ ఫామ్ ద్వారా కూడా డిపాజిట్ చేయవచ్చు అంటూ ఆర్బిఐ పేర్కొంది. ఈ పద్ధతిలో కూడా రూ. 2000 రూపాయల నోట్లు ఆర్బిఐ కి చేరగానే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: