Money: పోస్ట్ ఆఫీస్ లో వారి కోసమే ప్రత్యేక పథకాలు..!

Divya
మహిళలు సొంత కాళ్లపై నిలబడి డబ్బును రెట్టింపు చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహిళల కోసం పోస్ట్ ఆఫీస్ లో కొన్ని అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా వారి ఆదాయం కూడా రెట్టింపు అవుతోంది. ఇకపోతే మహిళల ఆదాయాన్ని పెంపొందించే కొన్ని పెట్టుబడి పథకాల గురించి ఇప్పుడు చూద్దాం.

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం..
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అనేది మహిళలకు ఉత్తమమైన ఎంపిక అని  చెప్పవచ్చు. ఇందులో రూ.1000 నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు ఈ పథకం ఐదు సంవత్సరాల కాల పరిమితి అయితే ఇందులో డిపాజిట్ ల పై 7.7% వడ్డీ కూడా లభిస్తుంది.

మహిళా సమ్మాన్ సముఖి పథకం:
మహిళా సమ్మాన్ సముఖి పథకం అనేది కేంద్ర ప్రభుత్వం.. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం. ఇందులో మహిళలు రూ .2లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇక రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఈ పథకంపై 7.5% వడ్డీ కూడా లభిస్తుంది.

టైం డిపాజిట్ పథకం:
పోస్ట్ ఆఫీస్ మహిళల కోసం అందిస్తున్న మరొక పథకం టైం డిపాజిట్ పథకం.. ఇందులో ప్రతినెల నిర్ణీత మొత్తంలో మీరు మీ ఖాతాలో జమ చేయవచ్చు.  ఇలా ఐదు సంవత్సరాల పాటు ఉండే ఈ పథకంలో పోస్ట్ ఆఫీస్ 7.5% వడ్డీని అందిస్తోంది. ముఖ్యంగా ఈ పథకం మహిళలకు ఒక అద్భుతమైన ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన పథకం:
ఈ పథకం ప్రత్యేకించి బాలికల కోసం ప్రారంభించబడింది. ఈ పథకం కింద తల్లిదండ్రులు తమ కుమార్తె పేరుమీద 10సంవత్సరాల వయసు వరకు ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది.  ఇందులో కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ .1.5లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంపై 8శాతం వడ్డీ కూడా లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: