Money: ఈ వ్యాపారంతో ప్రతి నెలా రూ.30 వేలు.. ఎలా అంటే..?

Divya
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొంతమంది ఉద్యోగాలు వదిలేసి వ్యాపారాల వైపు అడుగులు వేస్తే.. మరి కొంతమంది చాలీచాలని జీతం కారణంగా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే మరొకవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అందుకే ఇంటి దగ్గరే ఉండి వ్యాపారం చేయాలని అనుకుంటున్న వారికి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడి పైగా ఎక్కువ లాభాన్ని కూడా అందిస్తుంది. మరి ఆ బిజినెస్ ఐడియా ఏమిటి అంటే..? బిస్కెట్ తయారీ.. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్ లోనే మీరు బిస్కెట్లను తయారు చేయవచ్చు.
దీనికి కావలసిన పదార్థాలను కలపడం,  బిస్కెట్లను మీకు నచ్చిన రంగులలో వేసి బేక్ చేయడం, వాటిని ప్యాక్ చేయడం.. వంటి నాలుగు పనులు చేస్తే సరిపోతుంది.  తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరమయ్యే ఈ హోం బేస్డ్ బిజినెస్ తో మీరు ప్రతి నెల రూ .30 వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకుంటే.. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అదే సమయంలో కాస్త పెట్టుబడి కూడా అవసరం అవుతుందని గమనించాలి. ఇకపోతే చిన్న తరహా బిస్కెట్ తయారీ ప్రారంభానికి రూ .5లక్షల పెట్టుబడి అవసరమైతే .. అందులో మీరు కేవలం రూ.90, 000 పెట్టుబడి పెడితే చాలు మిగతా రూ.4.1లక్షల రుణాన్ని ప్రధానమంత్రి ముద్ర యోజన నుంచి తీసుకోవచ్చు.
 ఇక దీనికోసం ఓవెన్లు ,  రిఫ్రిజిరేటర్లు ,  గ్రైండర్లు, మిక్సర్లు వంటి పరికరాలు అలాగే పిండి,  చక్కెర , గుడ్లు,  వెన్న , స్పైసెస్ వంటి పదార్థాలను ఈ డబ్బులతో మీరు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ పథకానికి మీరు అర్హత పొందాలి అంటే తప్పకుండా భారతీయ పౌరులై ఉండాలి. సరైన వ్యాపార ప్రణాళికను కలిగి ఉండాలి. బిస్కెట్ మేకింగ్ బిజినెస్ ప్రారంభించే వారికి ఈ పథకం ద్వారా లోన్ సులభంగా లభిస్తుంది. ఇలాంటి వ్యాపారాన్ని మొదలుపెట్టి మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: