ఏపీ అప్పులు.. ఎల్లో మీడియా శోకాలు?

Chakravarthi Kalyan
అప్పు లేకుండా ఎవరి జీవితం గడవదు. అది చిన్నదో, పెద్దదో అప్పు మొత్తం ఎంతైనా, ఏ అప్పు తీసుకోకుండా ఈదుకు రాగలగడం అసాధ్యం. సాధారణ జనం పరిస్థితే ఇలా ఉంటే ప్రజలను పరిపాలించాల్సిన ప్రభుత్వం పరిస్థితి ఇంకెలా ఉంటుంది, అప్పు చేయకుండా ఎలా కుదురుతుంది అని కొంతమంది వైసిపి ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ముప్పులతో ముందుకు సాగుతుందని కొంతమంది ప్రతిపక్ష పార్టీల వాళ్లు మాట్లాడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్లే ఈ విధంగా ముఖ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వం వైపు నుండి ఏదైనా చిన్న తప్పు కనబడినా ఎత్తి చూపిస్తూ ఉంటారు ఎవరైనా. అయితే వైసిపి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా 1300 కోట్లు అప్పు చేసిందని, బహిరంగ మార్కెట్ ద్వారా 1000 కోట్ల అప్పు చేసిందని వ్రాసుకోస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రికలు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలను అప్పుల పాలు చేస్తుందని మాట్లాడుతున్న వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం  అయితే అసలు అప్పే చేసేది కాదని అన్నట్లు మాట్లాడతారు. పైగా అప్పు తీసుకోవడం మాట ఎలా ఉన్నా కేంద్రానికి తిరిగి అప్పిస్తాడు చంద్రబాబు నాయుడు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే స్వయంగా చంద్రబాబు నాయుడే అప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుందని అన్న మాటలను ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేసుకోవాలని వైసిపి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు.

గతంలో చంద్రబాబు పాలనలో పసుపు కుంకుమలు ఇవ్వడానికి అప్పు చేయవలసి వస్తుందని, టిడిపికి ఇళ్లు ఇవ్వడానికి కూడా అప్పు చేయవలసి వస్తుందని చంద్రబాబు నాయుడు  స్వయంగా చెప్పడం జరిగింది.  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమైనా మిగిలు బడ్జెట్ ఉందా అప్పుడు కూడా లోటు బడ్జెట్ తోనే ఆయనకు ప్రభుత్వాన్ని అందించారు కదా అని అడుగుతున్నారు కొంత మంది వ్యక్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: