Money: గ్రామీణ యువతకు శుభవార్త.. సొంత ఊరి నుంచే సంపాదన..!

Divya
నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురుచూసి సమయాన్ని వృధా చేసుకుంటున్న నేపథ్యంలో ఇకపై ఏమాత్రం సమయం వృధా చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాల ద్వారా లోన్ పొంది మంచి వ్యాపారాన్ని మొదలుపెట్టి ప్రతి నెల చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ యువత ఇంటి వద్దనే ఉంటూ సొంత ఊరిలోనే మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు గ్రామంలో ఉండి సొంత వ్యవసాయ భూమి లేదా ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉన్నట్లయితే ఆర్గానిక్ కోళ్ల పెంపకం మొదలు పెట్టవచ్చు. తద్వారా మీరు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో బ్రాయిలర్ కోళ్ల ఫారం ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే బ్రాయిలర్ కోళ్ల ఫారం ఏర్పాటు చేయాలి అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. కాబట్టి మార్కెట్లో ఉన్న పౌల్ట్రీ సంస్థల నుంచి ఫ్రాంచైజీ కూడా పొందాల్సి ఉంటుంది కానీ మీరు సొంతంగా నాటు కోళ్ల ఫామ్ ఏర్పాటు చేస్తే ఆదాయం మీకే లభిస్తుంది. ఉదాహరణకు మీ వద్ద ఒక అర ఎకరం వ్యవసాయం భూమి ఉన్నట్లయితే ఓపెన్ పద్ధతిలోనే నాటు కోళ్ల ఫారం ప్రారంభించవచ్చు.  మామిడి తోట , జామ తోట వంటి తోటలు ఉంటే అందులో అదనపు ఆదాయం వచ్చేందుకు ఈ ఫారం చక్కగా ఉపయోగపడుతుంది.

సాంప్రదాయ పద్ధతిలోనే వీటిని పెంచి మార్కెట్లో అమ్మవచ్చు.  పెట్టుబడి ఖర్చు తక్కువ పైగా ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది.  ముఖ్యంగా తోటలో లభించే పురుగులు ఇతర పోషకాలను కోళ్లు సేకరించి అవి బరువు పెరిగి మీకు ఖర్చును కూడా తగ్గిస్తాయి.  ప్రస్తుతం ఈ కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి మీరు కేవలం రూ .10, 000 పెట్టుబడి పెట్టిన సరే మీకు మంచి ఆదాయం లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం సొంత ఊరిలో ఉండి ఈ ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: