Money: అద్భుతమైన పాలసీతో మన ముందుకు వచ్చిన ఎల్ఐసి..!
అయితే ఈ పాలసీ పేరు ఎల్ఐసి ఆధార్ శిలా..
ఈ ప్లాన్ కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. ఎల్ఐసి అందిస్తున్న ఈ ఆధార్ శిలా స్కీమ్ నాన్ లింక్డ్ ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తం చెల్లుతుంది. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి డబ్బులను తిరిగి పొందవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా రెండు రకాల బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్ తీసుకోవాలని భావించినట్లయితే 8 నుంచి 55 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. పది నుంచి 20 సంవత్సరాలు టెన్యూర్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన టెన్యూర్ తో పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది.ఇకపోతే కనీసం రూ.75 వేల మొత్తానికి ప్లాన్ తీసుకుంటే గరిష్టంగా రూ.3లక్షల వరకు ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు మీరు రూ.3లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలని భావిస్తే ఉదాహరణకు మీ వయసు 30 సంవత్సరాల అనుకుంటే నెలకు 900 రూపాయలు చెల్లించాలి అంటే రోజుకు 30 రూపాయలు ఆదా చేయాలన్నమాట. ఒకవేళ 15 సంవత్సరాలనుకుంటే నెలవారి ప్రీమియం రూ.870చెల్లించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాలు అయితే నెలకు రూ .1570 ల ప్రీమియంతో ఏకంగా రూ .6లక్షలు పొందవచ్చు.