Money: మంచి ఆదాయాన్ని అందించే కేంద్ర ప్రభుత్వ పథకం..!

Divya
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా పలు పథకాల పేరుతో ఆర్థికంగా వెన్నుతట్టి వారిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోని చేతివృత్తులు చేసుకునే కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతినెల 8 వేల రూపాయలను ఆర్థిక సహాయం కింద అందజేస్తుంది. ముఖ్యంగా హస్తకళల ఉత్పత్తులకు ఆదరణ లేక దారిద్యంలో మునిగి తేలుతున్న కళాకారులకు ప్రతి నెల 8000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

కేంద్ర జౌళి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా కుండలు చేసే వారిని మొదలు.. చేనేత కార్మికులకు, ఆభరణాలు చేసే వారికి , చెక్కలు చెక్కే వారికి ఇలా నైపుణ్యం కలిగిన చేతివృత్తులు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? ఆఖరి తేదీ ఎప్పుడు ? అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం.

ముఖ్యంగా దేశంలో ఉన్న హస్త కళాకారులందరూ కూడా ఈ పథకంలు చేరడానికి అర్హులే.. హస్తకళలలో జాతీయ పురస్కారం , శిల్పి గురు పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం,  చేత పురస్కారం పొందిన కళాకారులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా మెరిట్ సర్టిఫికెట్ పొందిన హస్తకళాకారులు కూడా ఈ పథకానికి అర్హులేనట. ముఖ్యంగా 2023 మార్చి 31 నాటికి 60 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరుకుంది ముఖ్యంగా నష్ట కళాకారుల కుటుంబ వార్షికోత్సవం లక్ష రూపాయల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులట.

ఫస్ట్ కళాకారుడు లేదా హస్త కళాకారుని ఆధార్ కార్డు పాన్ కార్డు గుర్తింపు కార్డుతో పాటు మండల రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ జారీ చేసిన వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. అలాగే ఆధార్ అనుసంధానం చేసిన బ్యాంకు పొదుపు ఖాతా నెంబర్ కూడా ఉండాలి. ఇక ఈ పత్రాలను ప్రాంతీయ లేదా కేంద్ర హస్తకళ కార్యాలయానికి తీసుకెళ్తే అక్కడ ఉన్నతాధికారుల పత్రాలను దరఖాస్తును ధ్రువీకరిస్తారు. జూలై 15 2023.

ప్రధాన కార్యాలయం చిరునామా..
డెవలప్మెంట్ కమిషనర్ , మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వెస్ట్ బ్లాక్ నెంబర్ సెవెన్ , ఆర్కే పురం న్యూఢిల్లీ, ఫోన్ నెంబర్  011-26100049.

వెబ్సైటు : https://www. handicrafts.nic.in

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: