Money: మహిళల కోసం అద్భుతమైన స్కీం..!
ఈ పథకం 2025 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది.. అయితే ఆ తేదీలోపు మీరు పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. ఇకపోతే కనిష్టంగా వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఇందులో 7.5% ఉంటుంది దాని ప్రకారం గరిష్టంగా రెండు లక్షలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి రూ.16,000, రెండు సంవత్సరాలకి 32 వేల రూపాయల వడ్డీ లభిస్తుంది అంటే మీరు నెలవారీగా చూసుకున్నట్లయితే 1300 రూపాయలను వడ్డీ కింద ఈ పథకం ద్వారా పొందవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీని రూ. 40 వేల లోపు ఉన్నందున టీడీఎస్ వర్తించదు అని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ మొత్తం వారి ఆదాయానికి జోడించబడుతుంది అని కూడా సమాచారం. ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబు ప్రకారం పన్ను విధించబడుతుంది. కానీ అది సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి అయితే ఈ విషయం తెలిసి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పేద మధ్యతరగతి మహిళలకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.