మనీ: రూ.100 ఆదాతో కోటీశ్వరులయ్యే అవకాశం..ఎలా అంటే.?

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది కోటీశ్వరులు కావాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నా ఆ మార్గంలో కరెక్ట్ గా వెళ్తేనే మనం డబ్బును సంపాదించడానికి వీలవుతుంది. ముఖ్యంగా దీనికోసం ప్రతి రోజు ఖర్చులను తగ్గించుకొని ఆదా చేస్తే కచ్చితంగా ఆదాయాన్ని పెంచవచ్చు. సాధారణంగా చాలామందికి రోజుకు 100 రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అదే వంద రూపాయలను మీరు దాచుకుంటే సుదీర్ఘకాలంలో మంచి లాభం పొందవచ్చు.
ఇక మీరు ప్రతి రోజు 100 రూపాయల చొప్పున SIP లో పెడితే అది ఒక నెలలో 3000 రూపాయలు అవుతుంది ఒక సంవత్సరానికి 36వేల రూపాయలు మీరు ఆధా చేయవచ్చు.  ఇక దీనిపై ప్రతి యేటా 12 శాతం రాబడి కూడా లభిస్తుంది. ఇక ఇప్పుడు మీరు ఈ డబ్బును 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే దాదాపు రూ.1,05,89,741 కోట్లు పొందుతారు. ఇందులో మీ పెట్టుబడి కేవలం రూ. 10.8 లక్షలు మాత్రమే.. కానీ మీకు వచ్చే లాభం రూ.95 లక్షలు. అంటే మీరు 100 రూపాయలు ఖర్చు చేయడం వల్ల ఇంత నష్టపోతున్నారు అన్నమాట.

SIP లో సుదీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా బహుళ ప్రయోజనాలను పొందవచ్చు.  ముఖ్యంగా ఎక్కువ కాలం డబ్బు పెట్టుబడి పెడితే అంతకుమించి లాభాలను ఆర్జించవచ్చు. ఇక మార్కెట్ ఆధారంగా SIP లాభాలు అనేవి ఆధారపడి ఉంటాయి.  కాబట్టి పెట్టుబడి  పెట్టేముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం.  వాస్తవానికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు కాస్త ఖర్చుతో కూడుకున్నవి. అలాంటప్పుడు మీరు మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కానీ ఒకసారి మీరు నమ్మకమైన దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే డబ్బు పొందవచ్చు. ఏది ఏమైనా ప్రతిరోజు 100 రూపాయల ఆదా చేస్తే అంతకు  మించి ఆదాయం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: