Money: తల్లులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం.. డబ్బు జమ..!
ఇకపోతే రైతుల కోసం.. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రైతు భరోసా పథకాన్ని ప్రవేశ పెడితే ఇప్పుడు వసతి దీవెన పథకాన్ని కూడా ప్రవేశపెట్టి ఎంతో మందికి ఆసరాగా నిలిచింది. ఇకపోతే ఈ పథకం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. వసతి దీవెన పథకానికి అర్హులైన వారందరి ఖాతాల్లో ఈ సంవత్సరం విడత డబ్బులను జమ చేయడానికి ముహూర్తాన్ని కూడా ఆయన నిర్ణయించడం జరిగింది. ఇక లబ్ధిదారుల ఖాతాలో ఈనెల 26వ తేదీన వసతి దీవెన డబ్బులను ముఖ్యమంత్రి బటన్ నొక్కి మరీ జమ చేయనున్నారు.
ఇకపోతే ఈనెల 26వ తేదీన అనంతపురం జిల్లాకు చెందిన శింగనమల నియోజకవర్గం నార్పల వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖాతాల్లోకి వసతి దీవెన నగదును విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమం ఈనెల 17వ తేదీన జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. కానీ కొన్ని కారణాలవల్ల వసతి దీవెన కార్యక్రమం తేదీని వాయిదా వేసి ఈనెల 26వ తేదీన ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ అభ్యసించే వారికి రూ.20వేల వరకు వసతి, భోజన, రవాణా ఖర్చులకోసం వారి తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక పై చదువులు చదువుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు యూనివర్సిటీలు , బోర్డులో చదివే వారు ఇందుకు అర్హులు. అయితే విద్యార్థులు కచ్చితంగా 75% హాజరు ఉండాల్సిందే.