మనీ: రూ.30 పొదుపు చేస్తే చాలు రూ. 5లక్షలు మీ సొంతం..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది తక్కువ పొదుపుతో ఎక్కువ లాభం పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారి కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు పోస్ట్ ఆఫీస్ లో ఎల్ఐసి లు కూడా రకరకాలుగా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి సామాన్య ప్రజలకు కూడా మరింత ఊరట కలిగిస్తున్నాయి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్ తో మన ముందుకు వచ్చింది. ఇందులో డబ్బులు దాచుకోవడమే కాదు రెట్టింపు స్థాయిలో డబ్బులు పొందవచ్చు. ఇక అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్..
ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల పలు రకాల ప్రయోజనాలతో పాటు రిస్క్ లేకుండా భారీ రాబడి పొందవచ్చు.అందుకే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించేవారు ఒకసారి ఈ పథకం గురించి తెలుసుకొని ఆ తర్వాత పెట్టుబడి పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఈ పథకంలో రూ.10,000 పొదుపుతో రూ.4లక్షలకు పైగా డబ్బులు పొందవచ్చు. ఉదాహరణకు మీరు ప్రతి ఏడాది పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకున్నట్లయితే 20 సంవత్సరాల లో పథకం మెచ్యూర్ అవుతుంది అప్పుడు మీ చేతికి రూ.4.5 లక్షల వరకు డబ్బు లభిస్తుంది.
ప్రస్తుతం ఈ పథకంలో 7.1% వడ్డీ రేటు లభిస్తోంది ఇక మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రెండు లక్షలు అయితే మీకు వచ్చే రాబడి 2.4 లక్షలు మొత్తం రూ.4.5 లక్షల వరకు లాభం పొందవచ్చు. ఏడాదికి రూ.వేలు అంటే రోజుకు దాదాపు 27 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. అదే మీరు రూ. 5.3 లక్షల పొందాలి అంటే సంవత్సరానికి 12,000 అంటే రోజుకు 30 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. అంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మీరు పొదుపు చేయడం వల్ల 20 సంవత్సరాలు తర్వాత రూ.5.3 లక్షలు మీరు సొంతం చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో సుదీర్ఘకాలంలో ఎక్కువ డబ్బును పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: