సంక్రాంతి పండుగ ఎప్పుడు? 14నా? 15 నా.. పండితులు ఏమన్నారంటే..?
ధనస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ రోజునే కొన్ని ప్రాంతాలలో మకర సంక్రాంతి జరుపుకుంటారు. కానీ మరికొన్ని ప్రాంతాలలో వారు మాత్రం ఆ తరువాత రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. పండితులు తెలుపుతున్న ప్రకారం 14వ తేదీన బుధవారం భోగి, 15వ తేదీన గురువారం మకర సంక్రాంతి, 16వ తేదీన శుక్రవారం కనుమ, 17వ తేదీ శనివారం అనే విధంగా స్పష్టతతో పండితులు తెలియజేస్తున్నారు.
సూర్య సంక్రమణ, మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయాల్లో జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. హిందువుల సంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయానికి ఉన్నతీ తిధినే ప్రమాణికంగా తీసుకుంటారు. సూర్య సంక్రమణం 14వ తేదీన ఆలస్యంగా జరుగుతుందని పండితులు అంచనా వేస్తున్నారు. కాబట్టి అంటే ఆ మరుసటి రోజు జనవరి 15వ తేదీన సూర్యోదయం నాటికి సంక్రాంతి ఉన్నందువలన ఆరోజే జరుపుకోవాలని పండితులు సైతం తెలియజేస్తున్నారు. జనవరి 14న భోగి పండుగతో ప్రారంభించి 15న సంక్రాంతి లక్ష్మీని ఆహ్వానించి, 16వ తేదీన కనుమ పండుగ రోజున పశువులను పూజించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పండితుల సైతం తెలియజేస్తున్నారు. కుటుంబ ఆచారాలు, సాంప్రదాయాలను బట్టి చేసుకోవడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.