మనీ: ఆ ఉద్యోగులకు 7.. శాతం ఫిట్ మెంట్..!!

Divya
తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు తాజాగా ఆ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది..7 శాతం ఫిట్మెంట్ పెంపుతో కొత్త వేతన సవరణ ఒప్పందం కుదిరింది. నిన్నటి రోజున సాయంత్రం విద్యుత్ సౌధ సమావేశం మందిరంలో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపించాయి. ఉద్యోగ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు.. దేవులపల్లి ప్రభాకర్ రావు, రఘు రామ రెడ్డి ,ఏ గోపాల్ రావు చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. అయితే తమకు జీతాలు మాత్రం పెంచకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి సమ్మె చేపడతామని తెలియజేశారు.

దీంతో గత నెల 30వ తేదీన నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది .. చర్చలు ఫలించడంతో కొత్తవేతలను సవరణ ఒప్పందం పైన విద్యుత్ సంస్థలు యాజమాన్యాలు ఐకాసా నేతలు సంతకాలు చేయడం జరిగింది .ఈ మేరకు సమ్మె నోటీసు కూడా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ కొత్త పిఆర్సి నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి కూడా 7 శాతం ఫిట్ మెంట్.. 2020 ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి వేతనం రాబోతోంది. గత 12 నెలలగా కొత్త పిఆర్సి పెంపు బకాయిలు వచ్చే 12 నెలల సమానంగా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

అలాగే ఉద్యోగి సర్వీస్ కాలం ఐదేళ్ల లోపు ఉంటే అదనంగా మరొక ఇంక్రిమెంట్ 5 నుంచి 15 ఏళ్ళు ఉంటే రెండు అంతకుమించి సర్వీసు ఉంటే మూడు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.. అలాగే ఉద్యోగులకు ఇస్తున్న విధానంలోనే ఇంటి అద్దె భాత్యం, వైద్య, పింఛన్లు చెల్లిస్తారు రిటైర్మెంట్ గ్రాడ్యుటీని రూ .12 లక్షల నుంచి రూ .16 లక్షలకు పెంచారు. మరొకవైపు వైద్య ఖర్చులకోసం చెల్లించి డబ్బులు రూ.5 నుంచీ.. రూ.10 లక్షలకు పెంచడానికి అంగీకరించినట్లు ఐకాసా తెలియజేసింది. మరొక ఆఫర్ ఏమిటంటే ఒకవేళ ఉద్యోగి తన వేతనం నుంచి నెలకు ₹1000 చెల్లిస్తే వైద్య ఖర్చులకు ఇచ్చే సొమ్ము రూ .12 లక్షల వరకు చేరుతుందని తెలిపారు. అలాగే 1999 నుంచి 2004 మధ్యలో చేరిన ఉద్యోగులు ఈపీఎఫ్ నుంచి జిపిఎఫ్ లోకి మార్చాలని ప్రతిపాదనను కూడా ఆ ప్రభుత్వం ని కి పంపుతామని సీఎం డీలు చెప్పినట్లు ఐకాస తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: