మనీ: రూ.150 పెట్టుబడితో రూ.8 లక్షలకు పైగా ఆదాయం..!
ఈ పాలసీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మెచ్యూరిటీ సమయంలో మంచి లాభాలు కూడా పొందవచ్చు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీ పెట్టుబడిదారుల కోసం రకరకాల విభిన్నమైన పాలసీలను అందజేస్తూనే ఉంది. ముఖ్యంగా ఎల్ఐసి అందిస్తున్న పాలసీలలో జీవన్ తరుణ్ పాలసీ 1. ఈ పాలసీ ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించబడింది. ఇది పిల్లల విద్య, పెళ్లి, ఇతర ఖర్చులకోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పాలసీలో 20 సంవత్సరాల ప్రీమియం చెల్లించడం ద్వారా 25 సంవత్సరాల పాటు కవర్ ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పిల్లల కనీస వయసు 90 రోజులు ఉండాలి.
ఈ ప్లాన్ గరిష్టంగా 12 సంవత్సరాల పిల్లల కోసం కొనుగోలు చేయవచ్చు. ఇక అదే సమయంలో పిల్లల వయసు 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ మొత్తం మీ చేతికి వస్తుంది. ఇక ఈ పాలసీలో రూ. 150 చొప్పున రోజూ ఇన్వెస్ట్ చేస్తే వార్షిక ఆదాయం రూ. 54, 000 అవుతుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టే ఎనిమిది సంవత్సరాల లో మొత్తం రూ.4,32,000 అవుతుంది . అదనంగా రూ.2,47,000 రూపాయలు బోనస్ లభిస్తుంది. ఈ పాలసీ హామీ మొత్తం రూ.5 లక్షలు అలాగే దీని తర్వాత మీరు లాయల్టీ బోనస్ కింద రూ.97,000 సొంతం చేసుకుంటారు. మొత్తంగా ఈ పథకం ద్వారా మీరు రూ.8,44,550 పొందుతారు.