మనీ: రూ.25 వేలతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే ప్రతి నెల ఆదాయం..!
అయితే ఈ పోహా ను చాలా మంది దొడ్డు అటుకులు అని కూడా పిలుస్తూ ఉంటారు. పోహాను పోషక కరమైన ఆహారంగా పరిగణిస్తారు. కాబట్టి వీటిని తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. పోహా అనేది వేగంగా జీర్ణం అవుతుంది. అందుకే పోహా మార్కెట్ వేగంగా పెరగడానికి ఇదే కారణం. ఇటీవల కాలంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పోహాను ఎక్కువగా తీసుకుంటున్నారు. చలికాలం అయినా వేసవికాలం అయినా ప్రజలు ప్రతినెల ఎంతో ఉత్సాహంతో దీనిని తీసుకుంటారు. కాబట్టి ఈ వ్యాపారానికి ఎప్పుడు కూడా డిమాండ్ తగ్గదు. మీరు కూడా పోహా తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడం వల్ల లాభదాయకమైన వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం పోహా తయారీ యూనిట్ ధర దాదాపు రూ.2 లక్షలు . ఇందులో మీకు 90% వరకు రుణం లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పోహా యూనిట్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించడానికి 25వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. గ్రామ పరిశ్రమల ప్రోత్సహించడానికి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా ప్రతి సంవత్సరం రుణం పొందవచ్చు. ఈ వ్యాపారం ద్వారా మీకు ప్రతి నెల అద్భుతమైన లాభం వస్తుంది. ఈ వ్యాపారంతో ఎటువంటి నష్టం కూడా కలగదు.