మనీ: తక్కువ పెట్టుబడితో డబుల్ బెనిఫిట్.. ఈ వ్యాపారంతో లాభాలే లాభాలు..!

Divya
ఇటీవల కాలంలో చాలామంది వ్యాపారం చేయాలి అని అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మీకోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఇందులో తక్కువ పెట్టుబడితో డబుల్ బెనిఫిట్ పొందవచ్చు. అలాంటి వాటిలో అరటిపండు పొడి వ్యాపారం ఈ వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకు అరటిపండు మాత్రమే. అలాగే అరటిని ఆరబెట్టే యంత్రం, మిక్సర్ యంత్రం కూడా అవసరం అవుతాయి. మార్కెట్ లేదా ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
ఇకపోతే అరటిపండును పొడి చేయడానికి ముందుగా సోడియం హైపోక్లోరైడ్ తో  పండ్లను శుభ్రం చేయాలి. ఆ తర్వాత చేతితో వొలిచి సిట్రిక్ యాసిడ్ లో ఐదు నిమిషాలు ముంచాలి. ఇప్పుడు అరటి పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి 60 డిగ్రీల సెల్సియస్ వేడి వద్ద గాలిలో 24 గంటల పాటు ఉంచాలి. ఆరిన తర్వాత మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి.  అయితే ఈ పొడిని తయారు చేసిన తర్వాత గాజు సీసా లేదా పాలిథిన్ సంచులలో ప్యాక్ చేయాలి.

రోజు ఐదు కేజీల అరటికాయ పొడిని మార్కెట్లో అమ్మితే రూ.4000 వరకు లాభం కూడా పొందవచ్చు. మొదట్లో వ్యాపారం నెమ్మదిగా సాగినా.. తర్వాత క్రమంగా జోరు అందుకుంటుంది. మీరు పెట్టిన పెట్టబడి నెల రోజుల్లోనే వచ్చేస్తుంది.  ఆ తర్వాత దాదాపు డబుల్ ప్రాఫిట్ లభిస్తుంది. అయితే అరటిపండు పొడిని ఎవరు కొంటారు అనే సందేహం కలగక మానదు.  ఇది కొత్త వ్యాపారం కాబట్టి ప్రజలకు పూర్తిగా తెలియదు అని కూడా అనుకోవలసిన అవసరం లేదు. అరటి పండ్లను నిత్యం కొనలేని వాళ్ళు అరటి పండును పౌడర్ రూపంలో తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది . బీపీతో బాధపడేవారు ఇప్పుడు ఎక్కువగా ఈ అరటిపండు పొడిని కొంటున్నారు.
ఈ పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే మీరు చేసే ప్రమోషన్స్ ద్వారానే మీ వ్యాపారం రెట్టింపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: