మనీ: వృద్ధాప్యంలో కూడా రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే ఇలా చేయండి..!

Divya
ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు కోసం ఆలోచించి ఇప్పటినుంచి సేవింగ్స్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురవవు. ముఖ్యంగా 60 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు వివిధ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి వీటివల్ల అనేక పన్ను ప్రయోజనాలు అధిక వడ్డీ రేట్ల తో వచ్చే కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే చివరి దశలో కూడా రెగ్యులర్ ఇన్కమ్ అందించే రెండు స్కీమ్స్ మాత్రం ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి అదేంటో మనం చూసి తెలుసుకుందాం.

ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కిన్ పీఎం వయో వందన యోజన స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ద్వారా వృద్ధ దంపతులకు ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు క్రమమైన స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు పథకాలకు ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది. వీటిల్లో రిస్క్ ఉండదు.. ప్రభుత్వ హామీ ప్రకారం స్కీం టెన్యూర్ నుండి అంతా వడ్డీ పొందవచ్చు. ఈ రెండు పథకాలు మీకు ఇప్పుడు ఎనిమిది శాతం వడ్డీని సంవత్సరానికి అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం టెన్యూర్ మూడు సంవత్సరాలు కాగా మరో మూడు సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
పీఎం వయో వందన యోజన పథకం టెన్యూర్ 10 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో డబ్బు పెట్టుబడిగా పెట్టినప్పుడు ఆదాయాన్ని లాక్  చేసుకోవచ్చు.  స్థిరంగా రిస్క్ లేని ఆదాయం అందుకోవాలని భావించే సీనియర్ సిటిజన్ లు  తమ రిటైర్మెంట్ ఫండ్ ను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇకపోతే ఈ స్కీమ్లో గరిష్ట పెట్టుబడిపై పరిమితి ఉంది. రూ.15 లక్షలు గా ఈ లిమిట్ ను నిర్ణయించారు. రెండు పథకాలలో కూడా వ్యక్తిగతంగా 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.. వృద్ధాప్యంలో నెలవారి ప్రాతిపదికన 20వేల రూపాయల వరకు లభిస్తుంది. అలాగే భార్యాభర్తలు కూడా ఇందులో చేరవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: