మనీ: ఇలా చేస్తే బోలెడు లాభాలు మీ సొంతం..!
ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. అందులోనూ సాండ్విచ్ అంటే చాలామందికి ఇష్టం. మీరు కనుక సాండ్విచ్ బిజినెస్ ని మొదలుపెట్టినట్లయితే చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికోసం స్ట్రీట్ ఫుడ్ లాగా మీరు స్టాల్ ఏర్పాటు చేసుకొని.. మొదలు పెట్టవచ్చు. ఒకవేళ షాప్ ని అయినా సరే అద్దెకు తీసుకుంటే ఒక బేకరీ లాగా కూడా మొదలు పెట్టవచ్చు. ఇకపోతే సాండ్విచ్ తయారు చేయడానికి గ్రిల్ సాండ్విచ్ మిషన్ అవసరమవుతుంది.. ఈ మిషన్ ధర సుమారుగా రూ.10,000 వరకు ఉంటుంది. మిషన్ తో పాటు బ్రెడ్ మసాలా సామాన్లు ఇలా కొన్ని ఆహార పదార్థాలు అవసరం.
సాండ్విచ్ ని తయారు చేయడం కోసం కావాలంటే శిక్షణ కూడా తీసుకోవచ్చు. బేకరీ ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధి శిక్షణ కేంద్రాలలో మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. మీరు రుచి నాణ్యతను బాగా మెయింటైన్ చేసినట్లయితే మీకు 50 వేల రూపాయల వరకు లాభం మిగులుతుంది. పైగా ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం తక్కువ సమయమే వ్యాపారం చేయాల నుకుంటే సాయంత్రం పూట ఇలా సాండ్విచ్ స్టాల్ ఓపెన్ చేసి అమ్మవచ్చు. పైగా మంచి లాభాలు కూడా వస్తాయి.