మనీ: ఇంటి వద్దనే ఉంటూ.. భారీ లాభం ..ఎలా అంటే..?
వాటిలో పాపడ్ బిజినెస్ కూడా ఒకటి. అప్పడాల బిజినెస్ ఎంత ప్రావీణ్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భోజనంలో తప్పకుండా అప్పడం ఉండాల్సిందే. అంతగా డిమాండ్ పొందిన అప్పడాల వ్యాపారం మీకు కచ్చితంగా మంచి లాభాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మీరు ఈ బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే ప్రభుత్వం నుంచి చౌక వడ్డీ రేటుకి రుణం పొందవచ్చు. సుమారుగా ఈ బిజినెస్ ప్రారంభించడానికి 4 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది ..సుమారు 30 వేల కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో మీరు బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి 250 చదరపు మీటర్ల స్థలం.. కొన్ని యంత్రాలు.. ఇతర పరికరాల కోసం కూడా పెట్టుబడి పెట్టాలి.
అదే సమయంలో వర్కింగ్ క్యాపిటల్ కింద మూడు నెలల జీతం.. మూడు నెలల వరకు ముడి సరుకు.. ఉత్పత్తి ఖర్చులు కూడా కేటాయించుకోవాలి. సరైన స్థలాన్ని ఉంచి విద్యుత్ , నీరు మొదలైన వాటి బిల్లు కూడా అందులోకే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ వ్యాపారం మొదలుపెట్టడానికి మీకు ముగ్గురు పనివాళ్ళు అవసరం అవుతారు. యంత్రాల ద్వారా అప్పడాల ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి హోల్సేల్ మార్కెట్లో విక్రయించి మీరు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. బిజినెస్ బాగా క్లిక్ అయితే ఖర్చులకు పోను ప్రతినెల మీకు 40 వేల రూపాయల ఆదాయం అయితే లభిస్తుంది.