మనీ: రూ.4,500 ఫీజు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుందా.. క్లారిటీ ఇదే..!

Divya
దేశంలో ఉపాధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అనేక పథకాలను అమలులోకి తీసుకొస్తుంది.  ముఖ్యంగా అలాంటి వాటిలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కూడా ఒకటి.  ఈ పథకం కింద యువతకు సొంతంగా వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం దాదాపుగా రూ.10లక్షల వరకు రుణం ఇస్తుంది. ఈ క్రమంలోనే ఒక వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది . ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద రుణం తీసుకునే వ్యక్తి నుంచి వెరిఫికేషన్ ప్రాసెసింగ్ కోసం ప్రభుత్వం  రూ. 4500 తీసుకుంటున్నట్లు దీని సమాచారం.  అయితే ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా అసలు నిజం బయటకు వచ్చింది.
సోషల్ మీడియాల ద్వారా వైరల్ అవుతున్న ఈ అంశంపై పిఐబి క్లారిటీ ఇచ్చింది.. ముఖ్యంగా ఈ వార్తపై తనిఖీ చేసి వైరల్ అవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు అని స్పష్టం చేసింది.  ముఖ్యంగా ప్రభుత్వ ముద్ర యోజన పథకాన్ని కింద లోన్ పొందాలంటే రూ.4500 ఫీజు చెల్లించాలని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. వ్యక్తులు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దని సూచించింది.  ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లేక పూర్తిగా నాకు లేదని పిఐబీ తన ఫ్యాక్ట్ చెక్ లో గుర్తించింది.
అంతేకాదు పీఎం ముద్ర లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి అదనపు రుసుమును వసూలు చేయడం లేదు అని,  ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాంటిదే ఇప్పటివరకు ప్రకటించలేదు అని కూడా స్పష్టం చేసింది.  ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్త అయినా సరే మీరు స్వయంగా బ్యాంకులకు వెళ్లి నేరుగా అసలు విషయం ఏమిటో తెలుసుకోవచ్చు అని కూడా క్లారిటీ ఇచ్చింది.  ఏది ఏమైనా ముద్ర స్కీం కింద లోన్ పొందాలి అంటే ప్రాసెసింగ్ ఫీజు రూ.4500 చెల్లించాలి అన్నదాంట్లో నిజం లేదని ప్రూవ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: